టాలీవుడ్ లో ప్రస్తుతం ఫిట్ బ్యూటీల హావ నడుస్తోంది. బొద్దు గుమ్మలు రెండో హీరోయిన్ గా పరిమితమవుతుంటే బాడీ ని ఫిట్ గా ఉంచుకొనే వారు టాప్ స్థాయికి చేరుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మంత్రాన్ని జపించే టాలీవుడ్ టాప్ హీరోయిన్ జాబితాలో చోటు దక్కించుకుంది. అదే తరహాలో ఢిల్లీ సుందరి రాశీఖన్నా అడుగులు వేస్తోంది. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత జిల్, జోరు, శివమ్ , హైపర్, సుప్రీమ్ చిత్రాలతో బిజీ అయ్యింది. బెంగాల్ టైగర్ చిత్రంలో మాస్ మహారాజ రవితేజతో స్టెప్పులేసింది. ఆమె నటించిన ఆక్సిజన్ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
ఊహలు గుసగుసలాడే లో బొద్దుగా కనిపించిన ఈ సుందరి రాను రాను స్లిమ్ అయి మంచి బాడీ ని దక్కించుకుంది. దీంతో కోలీవుడ్ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మూడు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య హాట్ హాట్ డ్రస్సులతో మతి పోగొడుతోంది. దీంతో ఆమెను మీ ఫిట్ నెస్ రహస్యం ఏమిటని అడగగా.. ” అందరిలాగే కొంత వ్యాయామం చేస్తాను. ఎప్పుడూ సంతోషంగా ఉంటాను. ఏ పని చేస్తున్న ఆనందంగా చేస్తుంటాను. ఆ ఫీలింగ్ నా మనసుతో పాటు బాడీ ని ఫిట్ గా ఉంచుతుందని నమ్ముతాను” అని రాశీ ఖన్నా వెల్లడించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.