‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చూసాక అభిప్రాయం మారుతుంది : రాశీ ఖన్నా

  • February 14, 2020 / 01:49 PM IST

కెరీర్ ప్రారంభంలో కొన్ని గ్లామర్ రోల్స్ చేసినప్పటికీ.. ‘ఊహలు గుసగుసలాడే’ వంటి నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రం కూడా చేసింది రాశీ ఖన్నా. అంతేకాదు గోపీచంద్ తో చేసిన ‘జిల్’ చిత్రంలో కూడా సావిత్రి అనే పాత్రలో జీవించింది. అయితే ఆమెకు బాగా క్రేజ్ సంపాదించి పెట్టిన చిత్రం మాత్రం ‘తొలిప్రేమ’ అనే చెప్పాలి. ఈ చిత్రం తర్వాత రాశీ ఖన్నా రేంజ్ డబుల్ అయ్యింది. ఒక్క ఎన్టీఆర్ తో తప్ప మరే స్టార్ హీరోతో జతకట్టనప్పటికీ.. రాశీ కి ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది వాస్తవం. ‘ఛాలెంజింగ్ రోల్స్ చేస్తేనే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అని’ ఈ అమ్మడు బలంగా చెబుతుంది. ఈమె విజయ్ దేవరకొండ తో నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం వాలెంటైన్స్ డే రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈమె ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో మీ పాత్ర బోల్డ్ గా ఉండేలా కనిపిస్తుంది. మీరేమంటారు?

యెస్.. ఈ చిత్రంలో నా పాత్ర కాస్త బోల్డ్ గా ఉంటుంది. ఈ చిత్రంలో ఓ కొత్త రాశీని చూస్తారు. ఇందులో నా పాత్ర పేరు యామిని. నిజ జీవితంలో కూడా.. ప్రతీ అమ్మాయిలోనూ ఓ యామిని దాగుంటుంది. ఎమోషన్స్ మరియు పర్సన్స్ కు ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనేది నా పాత్ర తెలియజేస్తుంది.

ఈ చిత్రం టీజర్ విడుదలైనప్పుడు మీ ఫ్యాన్స్ నుండీ వచ్చిన రెస్పాన్స్.. ముందుగా మీరు ఎక్స్పెక్ట్ చేసారా?

ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని.. నిజంగా.. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు రాశీ ఎందుకు ఈ పాత్ర చేసావ్ అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అలాంటి కామెంట్స్ రాలేదు. సినిమా చూసిన తర్వాత వారి అభిప్రాయం పూర్తిగా మారుతుంది.

 

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్ లో మీ పాత్రని ఇంట్రొడ్యూస్ చేస్తూ ‘ది పార్ట్ నర్’ అని వేశారు? ఈ చిత్రంలో మీరు పార్ట్ నరా?

నా రోల్ ఎక్కువ చెప్పకూడదు (నవ్వుతూ) . చెప్తే స్టోరీ చెప్పేసినట్టే..! సో మీరే సినిమా చూసి తెలుసుకోండి.

హీరో విజయ్ దేవరకొండ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

విజయ్ తో వర్క్ చేయడం చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా చేస్తున్నప్పుడే తెలిసింది. అతనొక థియేటర్ ఆర్టిస్ట్ అని..! అందుకే అతను ప్రతీ సేన్ ను ఎంతో ఈజ్ తో చేస్తాడు అని. నిజంగా అతని డెడికేషన్ సూపర్. అతను ‘ఫియర్ లెస్’ కూడా..!

ఈ చిత్రంలో యామిని క్యారెక్టర్ కాకుండా.. మరో పాత్ర చూజ్ చేసుకోవాలి అంటే మిగిలిన హీరోయిన్స్ లో ఏ పాత్ర సెలెక్ట్ చేసుకుంటారు?

యామిని పాత్ర కాకుండా మరో పాత్ర సెలెక్ట్ చేసుకోవాలి అంటే.. నేను ఐశ్వర్య రాజేష్ పాత్ర సెలెక్ట్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఆ పాత్రను ఆమె చాలా బాగా ప్లే చేసింది.

క్రాంతి మాధవ్ డైరెక్షన్లో చేయడం ఎలా అనిపించింది?

క్రాంతి మాధవ్ గారి రైటింగ్ చాలా బాగా అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా డైలాగ్స్ ఎంతో ఆకట్టుకుంటాయి. మీరు టీజర్, ట్రైలర్ లో చూసారు కదా.. ఇంకా మనసుని హత్తుకుని.. ఆలోచింపచేసే డైలాగులు సినిమాలో ఇంకా ఉన్నాయి.

విజయ్ ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ అన్నాడు.. దానికి మీ స్పందన ఏమిటి?

విజయ్ అలా చెప్పడంతో నేను కూడా షాక్ అయ్యాను. ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తాను కానీ అతను లవ్ స్టోరీస్ చెయ్యాలి. అతనికి లేడీస్ ఫాలోయింగ్ ఉంది. అతనికి చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి.. అతను చెయ్యాలి.

టీజర్ రిలీజైనప్పుడు ‘అర్జున్ రెడ్డి’ ‘డియర్ కామ్రేడ్’ లా ఉంది అని చాలా మంది కామెంట్ చేశారు. దాని పై మీ స్పందన..!

‘అర్జున్ రెడ్డి’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలకి ఈ చిత్రానికి ఎటువంటి సిమిలారిటీస్ లేవు. ఆ సినిమాలు నేను చూసాను.. అలాగే ఈ సినిమా కూడా చూసాను .. అస్సలు సంబంధం ఉండదు. అయినా గడ్డం ఉన్నంత మాత్రాన.. ‘అర్జున్ రెడ్డి’ ‘డియర్ కామ్రేడ్’.. అయిపోతాయా..! (నవ్వుతూ)

వాలెంటైన్స్ డే రోజున సినిమా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి మీరెవరితో వెళ్తారు?

‘వాలెంటైన్స్ డే’ అంటే ‘డే ఆఫ్ లవ్’ … ఎవరితోనైనా వెళ్ళొచ్చు సినిమాకి..! (మళ్ళీ నవ్వుతూ)

– Phani Kumar

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus