Raashi Khanna: తనలో మరో యాంగిల్ చూపిస్తున్న రాశీ

  • June 16, 2021 / 10:52 AM IST

కొంతమంది హీరోయిన్లు గ్లామర్‌ డాల్స్‌లా కనిపిస్తారు కానీ, తమదైన రోజు ఎంత మంచి నటి అనేది నిరూపించుకుంటారు. దానికి కావాల్సిందల్లా వారికి నప్పే సరైన పాత్ర. అలా కాస్త ఆలస్యమైనా గ్రేట్‌ అనిపించుకున్న కథానాయిక రాశీ ఖన్నా. కమర్షియల్‌ హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసినా… ‘తొలి ప్రేమ’తో తనలోని నటిని చూపించింది రాశీ ఖన్నా. ఆ తర్వాత కూడా కొన్ని పాత్రలతో మెప్పించింది. తాజాగా మరోసారి తనలోని నటిని బయటకు తీసుకురాబోతోంది.

‘వరల్డ్ ఫేమస్‌ లవర్‌’ తర్వాత కాస్త స్లో అయినట్లు కనిపించిన రాశీ ఖన్నా కెరీర్… ఇప్పుడు మళ్లీ గాడిలో పడింది. గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’, నాగచైతన్య ‘థ్యాంక్‌యూ’లో నటిస్తోంది. ఇది కాకుండా ప్రభాస్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిందని ఇటీవల వార్తలొచ్చాయి. వీటితోపాటు కొన్ని తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటించనుంది. వీటిలో ఎక్కువ శాతం కమర్షియల్‌ సినిమాలే. అయితే నటనకు ప్రాధన్యముండేలా హిందీలో ఓ వెబ్‌ఫిల్మ్‌లో నటిస్తోందట రాశీ.

అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో ‘రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌’అనే వెబ్‌ ఫిల్మ్‌లో రాశీ ఖన్నా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో సైకో లాంటి హంతకురాలి పాత్రలో కనిపిస్తుందట. ఈ తరహా పాత్ర చేయడం రాశీకి ఇదే తొలిసారి. అయినా బాగా చేస్తుందనే నమ్మకం అయితే అభిమానుల్లో ఉంది. అన్నట్లు ఇందులో అజయ్ దేవగన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడట. దీంతోపాటు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది రాశీ.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus