డ్యాన్స్ చేసి చూడు అంటున్న రాశీ!

  • December 14, 2017 / 06:59 AM IST

తెలుగు తెరకు పరిచయమైన కొత్తలో బొద్దుగా.. ఇప్పుడు కాస్త కొవ్వు కరిగించి కొత్తగా కనిపిస్తున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ క్రేజ్ పెంచుకుంటూ వెళుతోంది. అయితే.. అమ్మడికి స్టార్ డమ్ మాత్రం రావట్లేదు. అందుకే గ్లామర్ తోపాటు తనలోని విభిన్న షేడ్స్ ను చూపించాలని తపిస్తోంది. అందులో భాగంగా “సుప్రీమ్” సినిమాలో తన గ్లామర్ తోపాటు కామెడీ టైమింగ్ ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈసారి రవితేజతో “బెంగాల్ టైగర్” అనంతరం కలిసి నటిస్తున్న “టచ్ చేసి చూడు” చిత్రంలో తన డ్యాన్సింగ్ స్కిల్స్ ను ప్రదర్శించనుంది. ఈ సినిమాలో రాశీ డ్యాన్స్ టీచర్ గా, అది కూడా మామూలు డ్యాన్సర్ కాదు హిప్ హాప్ అండ్ బెల్లీ డ్యాన్స్ మాస్టర్ గా అదరగొట్టనుందట. అందుకోసం చాలా కష్టపడి ట్రయినింగ్ కూడా తీసుకొందట.

ఇటీవలే “రాజా ది గ్రేట్” సినిమాతో హీరోగా బౌన్స్ బ్యాక్ అయిన రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం “టచ్ చేసి చూడు”. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో విడుదలకానుంది. సీరత్ కపూర్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామనుకొన్నప్పటికీ.. రీసెంట్ డెవలప్ మెంట్స్ చూస్తుంటే ఆ టైమ్ కి రిలీజవ్వడం కష్టం అనిపిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus