Rachita Ram: రొమాన్స్‌పై హీరోయిన్‌ కామెంట్స్‌… బ్యాన్‌ చేయాలంటూ..!

  • November 16, 2021 / 11:15 PM IST

మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఏముందిలే అనుకుంటే… ఏమవుతుందో కన్నడ నటి రచితా రామ్‌ని అడిగితే పక్కగా చెబుతుంది. సినిమా ప్రచారం గురించి వచ్చినప్పుడు అడిగే వాళ్లు చాలానే అడుగుతారు. కానీ మనం ఆచితూచి సమాధానం చెప్పాలి. ఈ మాట ఇండస్ట్రీలో చాలామంది చాలాసార్లు చెబుతుంటారు. అయితే ఈ విషయాన్ని మరచిపోయి నోరు జారింది రచితా రామ్‌. తన సినిమా ‘లవ్‌ యూ రాచు’ ప్రచారంలో భాగంగా ఇలా నోరు జారి మాటలు పడుతోంది.

‘లవ్‌ యూ రాచు’ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రేమికుల మధ్య జరిగే రొమాంటిక్‌ కథే ఈ సినిమా అని చిత్రబృందం చెబుతోంది. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలు బాగా బోల్డ్‌గా ఉన్నాయని అంటున్నారు. అదే మాట ఓ జర్నలిస్ట్‌ అడిగారు. దానికి రచిత స్పందిస్తూ… పెళ్లయ్యాక ఎవరైనా ఏం చేస్తారు… రొమాన్సే కదా… ఈ సినిమాలోనూ అదే ఉంటుంది అని అంది రచిత.

రచిత కామెంట్స్‌ ఇప్పుడు కన్నడ నాట నిషేధాల చర్చను బయటకు తీసుశాయి. ఆమెను నిషేధించాలంటూ కన్నడ క్రాంతి దళ్ అధ్యక్షుడు తేజస్వి నాగలింగస్వామి తీవ్రంగా మండిపడ్డారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్​కు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ‘లవ్ యూ రాచు’ సినిమా ప్రదర్శించకుండా, విడుదలను అడ్డుకుంటామని చెప్పారు. దీంతో సంప్రదాయలకు విరుద్ధంగా రచిత వ్యాఖ్యలు ఉన్నాయని… వెంటనే క్షమాపణలు చెప్పాలని ఫిల్మ్ ఛాంబర్​ రచితను ఆదేశించింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus