జాతకాలు, జ్యోతిష్యం నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. సినిమాలో జాతకం కరెక్ట్ అని చెబుతూనే.. విధిని ఎదిరించి బతకొచ్చని చూపించాడు. చేతిరేఖల కంటే.. చేతలతోనే మన రాతను మనం రాసుకోవచ్చని చెప్పే ప్రయత్నం చేశాడు. మరి నిజ జీవితంలో ఈ దర్శకుడికి జాతకాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసా..? జాతకాలు చెప్పేవాళ్లు తొంబై శాతం మంది ఫ్రాడ్స్ అని అంటున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.
‘రాధేశ్యామ్’ సినిమా కోసం చాలా కష్టపడ్డానని.. జ్యోతిష్యానికి సంబంధించి చాలా పుస్తకాలు చదివానని చెప్పారు. దాదాపు ఏడెనిమిదేళ్లు అదే పని అని.. చాలా మంది నిపుణుల్ని కలిశానని చెప్పారు. ఆ ప్రాసెస్ లో తను గమనించిన విషయాన్ని చెప్పారు. అదేంటంటే.. జాతకాలు చెప్పేవాళ్లలో 90శాతం మంది ఫ్రాడ్ ఉన్నారని అన్నారు. వాళ్లు చెప్పేదంతా ట్రాష్ అని.. కానీ ఓ పది శాతం మంది మాత్రం తనను సర్ ప్రైజ్ చేశారని అన్నారు.
కొన్ని విషయాలు మనకి తప్ప.. రెండో వ్యక్తికి తెలిసే ఛాన్స్ లేదని.. అలాంటి విషయాలను కూడా వాళ్లు ఓపెన్ గా చెప్పారని.. అతడికి ఎలా తెలిసిందో మనకు అంతుబట్టదంటూ చెప్పుకొచ్చారు. అలా షాకిచ్చే వారు ఓ పది శాతం ఉన్నారని అన్నారు. ఇలా నిజజీవితంలో జాతకాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు రాధాకృష్ణ కుమార్. జాతకాలను నమ్మడంలో తప్పు లేదంటున్న ఈ దర్శకుడు మానవ ప్రయత్నం లేకుండా జాతకాలు నిజం అవ్వవని చెప్పుకొచ్చాడు.
ఇక నిన్న విడుదలైన ‘రాధేశ్యామ్’ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. దీనిపై స్పందించిన దర్శకుడు లవ్ సబ్జెక్ట్ కి మిక్స్డ్ టాక్ రావడం కామన్ అని అన్నాడు. అయితే అమ్మాయిలకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!