పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండీ దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత వచ్చిన ‘రాధే శ్యామ్’ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థతో కలిసి ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా కృష్ణంరాజు, భాగ్య శ్రీ, జగపతి బాబు, మురళీ శర్మ తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో రూపొందిన పాటలు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వీకెండ్ వరకు బాగానే రాబట్టింది.కానీ సోమవారం నాడు చాలా దారుణంగా పడిపోయాయి.
ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 22.87 cr |
సీడెడ్ | 06.92 cr |
ఉత్తరాంధ్ర | 04.69 cr |
ఈస్ట్ | 04.02 cr |
వెస్ట్ | 03.11 cr |
గుంటూరు | 04.19 cr |
కృష్ణా | 02.43 cr |
నెల్లూరు | 02.00 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 50.23 cr |
తమిళ్ నాడు | 0.68 cr |
కేరళ | 0.29 cr |
కర్ణాటక | 04.10 cr |
నార్త్ ఇండియా (హిందీ) | 07.50 cr |
ఓవర్సీస్ | 10.90 cr |
రెస్ట్ | 04.00 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 77.70 cr |
‘రాధే శ్యామ్’ చిత్రానికి రూ.196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.77.7 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.122.3 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది పూర్తిగా అసాధ్యమనే తేలిపోయింది. కాకపోతే ఈ సినిమా రూ.100 కోట్లు షేర్ ను రాబడుతుంది అని అంతా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ నిన్నటి కలెక్షన్లతో ఆ ఫీట్ కూడా కష్టమే అని తేలిపోయింది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!