రాధేశ్యామ్ గ్లింప్స్: వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేను చావను..!
February 14, 2021 / 09:37 AM IST
|Follow Us
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా నుంచి అప్ డేట్ వచ్చేసింది. రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేస్తూ గ్లింప్స్ ని రిలీజ్ చేసింది యూవి క్రియేషన్స్. అందమైన కొండల నడుమ దారిలో అందంగా వస్తున్న ట్రైన్ వ్యూజువల్ తో స్టార్ట్ అయ్యింది ఈ గ్లింప్స్. ఫ్లాట్ ఫార్మ్ పైన అందమైన ఇంగ్లీష్ ముద్దుగుమ్మల మద్యలో నుంచీ ప్రభాస్ గాల్లోకి అమాంతం పైకి లేచి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఎల్లో సూట్ లో ఎంతో ముద్దుగా ఉన్నాడు ప్రభాస్. తను ప్రేమించిన ప్రేరణని సయూనా ఏంజిలో అని పిలుస్తూ.., విదేశీ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ సూపర్ ఇంట్రో ఇచ్చాడు.
లవర్ బాయ్ గా ఫ్రెష్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. ఇక చిన్న స్మైల్ ఇచ్చుకుంటూ పూజాహెగ్దే అందంగా అలా నడుచుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తోంది. ఇక ఫైనల్ గా ప్రభాస్ చెప్పిన డైలాగ్ కి ఫిదా అయిపోతున్నారు అందరూ. నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా అని పూజాహెగ్ధే అంటే, ఛీ వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదంటూ.. చెప్పకనే చెప్పేశాడు. అంటే సినిమాలో ప్రభాస్ చచ్చిపోడని క్లియర్ గా అర్ధం అవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక రెండేళ్లగా సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఈ గ్లింప్స్ ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందనే చెప్పాలి. వాలెంటైన్స్ డే స్పెషల్ గా వచ్చిన ఈ గ్లింప్స్ నిడివి చిన్నదే అయినా అందరి మనసులని పెద్దగా గెలుచుకుంది.