‘అసలు లేనిదే పెసరపప్పు’ అన్నట్టు ఇంకా ‘రాధే శ్యామ్’ సినిమా రిలీజే కాలేదు.. అప్పుడే దానికి సీక్వెల్ అంటూ ఓ వార్త కోడై కూస్తోంది. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణా మూవీస్’ బ్యానర్ల పై నిర్మితమవుతున్న చిత్రం ‘రాధే శ్యామ్’. రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. చెప్పాలంటే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా మొదలైనప్పుడే ఈ చిత్రం కూడా మోడలింది. కానీ ఇప్పటివరకు ఈ చిత్రం షూటింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు.
ఇంకా దీని ప్యాచ్ వర్క్ చేస్తున్నారు మేకర్స్. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా ఉంటుంది కాబట్టి.. విడుదలవుతుంది అన్న గ్యారెంటీ అయితే కనిపించడం లేదు. ఇటీవల విడుదలైన టీజర్ కు మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేశారట దర్శకనిర్మాతలు. అయితే అది సెకండ్ పార్ట్ గా వస్తుందా లేక ‘రాధే శ్యామ్’ లోని పాత్రలతో రూపొందుతుందా అనేది తెలియాల్సి ఉంది.
‘సాహో’ కి కూడా సీక్వెల్ ఉంటుంది అన్నాడు ప్రభాస్. కానీ అది దాని ఫలితం పై ఆధారపడి ఉంటుందని కూడా వెల్లడించాడు. ‘సాహో’ ఫలితం తేడా కొట్టింది కాబట్టి.. సీక్వెల్ రాలేదు. మరి ‘రాధే శ్యామ్’ ఎలా ఉండబోతుందో..!
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!