Radhika Apte: తన భర్త గురించి హీరోయిన్ రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్..!
July 11, 2022 / 07:08 PM IST
|Follow Us
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధిక ఆప్టే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.’రక్త చరిత్ర’ ‘లెజెండ్’ ‘లయన్’ ‘కబాలి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. అయితే అటు తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. ఈమె ఏమి మాట్లాడినా సంచలనమే. అలాగే బోల్డ్ నెస్ కూడా ఎక్కువ. పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ షో కి ఏ మాత్రం వెనుకాడదు. అలాగే రాధిక ఆప్టే మంచి నటి కూడా.
బాలీవుడ్ లో ఈమె చేసిన ‘ప్యాడ్‌మ్యాన్’, ‘అంధాదూన్’, ‘బద్లాపూర్’ ‘గౌల్’ ‘సేక్రెడ్ గేమ్స్’ ‘ఫొరెన్సిక్’ వంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్ లో కూడా ఈమె నటిస్తుంది. రాధిక ఆప్టే కి పెళ్లయింది అనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసుంటుంది. 2013 లో ఈమె బెనెడిక్ట్ అనే లండన్ కు చెందిన మ్యుజిషియన్ ను వివాహం చేసుకుంది. ఈమె తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేయదు.
దీనిపై ఆమె స్పందిస్తూ.. “నేను ఇక్కడ.. బెన్ అక్కడ.! ఎప్పుడో ఒకసారి మాత్రమే కలుసుకుంటాం. నా పని నేను చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాను. నా పర్సనల్ విషయాలు బయట పెట్టడం నాకు ఇష్టముండదు. అయితే ఫోటోల విషయానికొస్తే నాకు ఫొటోలపై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండదు. ఇక బెన్ అయితే నాకంటే వేస్ట్. ఫోటోలు అంటే అస్సలు కోపరేట్ చేయ్యడు.
అందుకే మా పెళ్లి అయి పదేళ్లు కావస్తున్నప్పటికీ మా పెళ్లి ఫోటోలు కూడా లేవు. మా పెళ్ళికి మేము మా ఫ్రెండ్స్‌ను పిలిచాం, భోజనం అరేంజ్ చేశాం, మా స్నేహితుల్లో సగం మంది ఫొటోగ్రాఫర్లే.! కానీ నాకు ఫోటోలు దిగేంత ఆసక్తి లేదు.. కలుగలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.