సింగర్ గా మారుతున్న డ్యాన్స్ మాస్టర్..!

  • March 28, 2016 / 08:03 AM IST

కొరియోగ్రాఫర్ నుంచి హీరో అవతారం ఎత్తి తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేశాడు రాఘవలారెన్స్. ముని, కాంచన, గంగ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాఘవ.. ప్రస్తుతం తమిళంలో మొట్ట శివ కెత్త శివ అనే చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో హిట్ అందుకున్న పటాస్ తమిళ రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఆమ్రేష్ గణేష్ స్వరాలు సమకూరుస్తుండగా.. రాఘవ లారెన్స్ కూడా ఈ చిత్రం కోసం గొంతు సవరించుకున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే రాఘవ పాడిన పాటను రికార్డింగ్ చేయగా.. ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాయి రమణి దర్శకత్వంలో ఆర్‌బి చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాఘవ సరసన నిక్కి గల్రానీ జంటగా నటిస్తోంది.  ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus