నటుడు రాఘవ లారెన్స్ తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తన సేవా కార్యక్రమాలతో ఎందరినో ఆదరించాడు. కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన ఆ తరువాత నటుడిగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా తన సత్తా చాటుకుంటున్నారు. ఇతర దర్శకుల సినిమాలతో పోలిస్తే.. ఆయన చేసే సినిమాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కొన్ని మాత్రం వర్కవుట్ కాలేదు.
రాఘవ లారెన్స్ చేసిన సినిమాల్లో సక్సెస్ సాధించిన సినిమాల సిరీస్ అంటే ‘కాంచన’ అని చెప్పుకోవాలి. ముందుగా ‘ముని’ అనే టైటిల్ తో ఈ సిరీస్ ను మొదలుపెట్టాడు. ఆ తరువాత వచ్చిన ‘కాంచన’ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇక ఈ సిరీస్ లో వచ్చిన రెండు భాగాలు కూడా మంచి విజయం సాధించాయి. అయితే ఇప్పుడు ఈ సిరీస్ నుండి మరో సినిమా రాబోతుంది.
తాజాగా ‘దుర్గ’ అనే టైటిల్ తో ఓ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు రాఘవ లారెన్స్. ఈ పోస్టర్ లో నుదుట విభూతి ధరించి పెద్ద గడ్డంతో భయంకరంగా కనిపిస్తున్నారు. అయితే ఇది కాంచన సిరీస్ లో భాగమా.. లేదా కొత్త కాన్సెప్ట్ తో తీస్తున్నారా..? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ లుక్ చూసిన అభిమానులు మాత్రం మాత్రం ఇది కాంచన సిరీస్ లో వస్తున్న నెక్స్ట్ సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.