హీరోయిన్స్ విషయంలో రాజమౌళికి.. రాఘవేంద్రరావు సలహా?

  • May 10, 2019 / 01:33 AM IST

కె.రాఘవేంద్రరావు తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరిది. అప్పట్లో ఎన్టీఆర్. చిరంజీవి వంటి హీరోలు స్టార్లుగా ఎదగడంలో రాఘవేంద్ర రావుగారు పాత్ర చాలా ఉంది. ఇక ఈయన పరిచయం చేసిన ఏ హీరో, హీరోయిన్ అయినా సినీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్ కు ఎదుగుతారనే సెంటిమెంట్ కూడా ఉంది. అలాంటి రాఘవేంద్రరావు.. గారు సినిమాని ఎంతో రిచ్ గా ప్రెజెంట్ చేస్తుంటారు.. ముఖ్యంగా పాటల్లో.. అందులోనూ హీరోయిన్లను చాలా అందంగా చూపిస్తారనే పేరు కూడా ఉంది. ఇక మన దర్శకధీరుడు రాజమౌళి కూడా ఇదే విషయంలో రాఘవేంద్ర రావు గారిని సలహా అడిగాడట.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు ఈ విషయం పై స్పందిస్తూ … ” ఒకసారి రాజమౌళి నాతో … ‘సార్ నేను కూడా హీరోయిన్స్ ను తెరపై అందంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాను .. కానీ ఎంతగా ట్రై చేసినా మీరు చూపించినంత అందంగా నేను చూపించలేకపోతున్నాను .. కారణమేమిటో తెలియడం లేదు’ అని చెప్పుకొచ్చాడు. అప్పుడు నేను “ఒక హీరోయిన్ కి షేప్ బాగుంటుంది .. మరొకరికి కళ్ళు అందంగా ఉంటాయి .. ఇంకొకరి నవ్వు .. నడక అందంగా ఉంటాయి. హీరోయిన్స్ లో ప్రధానమైన ఆకర్షణను నేను ఎక్కువగా హైలైట్ చేస్తాను .. వాళ్ళలోని మైనస్ పాయింట్స్ ను తెర పై అస్సలు కనిపించనీయను. ఈ కారణంగానే నా సినిమాల్లో హీరోయిన్స్ అందంగా కనిపిస్తారని రాజమౌళికి చెప్పాను” అంటూ చెప్పుకొచ్చారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus