తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సైరా నరసింహ రెడ్డి చిత్రం గురించి రోజుకో న్యూస్ బయటికి వస్తోంది. మొన్నటి వరకు ఇందులో హీరోయిన్ గా ఎంపికైన నయనతార చిత్ర బృందానికి సరిగా సమాధానం చెప్పడం లేదని వార్తలు షికారు చేశాయి. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి ఆమె జాయిన్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించడంతో ఈ గాసిప్ ఆగిపోయింది. తాజాగా మరో వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే.. డైరక్టర్ సురేందర్ రెడ్డి టేకింగ్ పై చిరు సంతృప్తిగా లేరంట. అతను మాస్ గా తీయాల్సిన సన్నివేశాలను చాలా స్టయిలిష్ గా తీయడానికి ప్రయత్నిస్తున్నాడని చిరంజీవి భావిస్తున్నారు.
స్టైలిష్ మేకింగ్ అన్ని సమయాల్లో పనిచేయదని చిరు చెప్పినప్పటికీ డైరక్టెర్ వినటం లేదని సమాచారం. అంతేకాదు తొలి షెడ్యూల్ కే భారీ మొత్తాన్ని ఖర్చు చేయించినట్లు తెలిసింది. ఈ కారణాల వల్ల అతన్ని పక్కన పెట్టి వివి వినాయక్ ని తీసుకోవాలని చిరు అనుకున్నారు. అతన్ని సంప్రదించగా ఇంటెలిజెంట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల కుదరదని చెప్పినట్లు టాక్. దీంతో చిరు దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు ని సంప్రదించగా.. ప్రస్తుతం తన పరిస్థితి బాగా లేదని, టేకప్ చేయనని స్పష్టంగా చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. మరి చిరు సూచించినట్లు సురేందర్ రెడ్డి టేకింగ్ స్టైల్ మార్చుకుంటారా? లేకుంటే దర్శకుడు మారుతారా? అనేది త్వరలో తెలియనుంది.