ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, నటుడు రఘు కుంచె ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ గారి సినిమాలతో పాటు మర్యాద రామన్న సినిమాలో తాను పాడానని ఆయన తెలిపారు. అకస్మాత్తుగా మర్యాద రామన్న యూనిట్ నుంచి పిలుపు వచ్చిందని కీరవాణి గారు పాట నేర్పించే విధానం అద్భుతంగా ఉంటుందని రఘు కుంచె చెప్పుకొచ్చారు. సాధారణ వ్యక్తిని వజ్రంలా మార్చే సామర్థ్యం ఆయనలో ఉందని రఘు కుంచె తెలిపారు.
20 నిమిషాలలో నాకు పాట నేర్పించారని తను పాడిన పాట సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్ అయిందని రఘు కుంచె చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత రాజమౌళి సినిమాలో పాట పాడే ఛాన్స్ అయితే దక్కలేదని ఆయన అన్నారు. నా కెరీర్ ను చూసుకుంటే నవ్వు వస్తుందని ఆయన తెలిపారు. యువర్స్ లవింగ్లీ ప్రోగ్రామ్ వల్లే తనకు మంచి గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు. కో డైరెక్టర్ షిండే శివాజీని ఆ ప్రోగ్రామ్ కు యాంకర్ గా తర్వాత రోజుల్లో పెట్టారని రఘు కుంచె అన్నారు.
కంపారిజన్ ఉంటే లైఫ్ లో హ్యాపీగా ఉండలేమని రఘు కుంచె తెలిపారు. 2000లో బాచి సినిమాలో పాడగా మృగరాజు సినిమాలో తాను హంగామా హంగామా పాడానని రఘు కుంచె చెప్పుకొచ్చారు. హంగామా హంగామా పాటను మొదట నేను పాడానని కేకే పాడాల్సిన పాటను ఆయన అందుబాటులో లేకపోవడంతో నాతో పాడించారని చిరంజీవి గారు చెప్పడం వల్ల నాకు ఛాన్స్ దక్కిందని ఆయన తెలిపారు.
ఆ తర్వాత మళ్లీ కేకేతో హంగామా సాంగ్ పాడించగా ఆ విషయం చిరంజీవి దృష్టికి తెచ్చానని ఆయన అన్నారు. చిరంజీవి కోపంతో శబ్దాలయకు వచ్చి మేనేజర్లపై సీరియస్ అయ్యారని తర్వాత నా వాయిస్ తో ఉన్న సాంగ్ పెట్టారని ఆయన తెలిపారు. మృగరాజు సినిమా ఫ్లాపైందని అందువల్ల కెరీర్ విషయంలో తాను వెనుకబడ్డానని ఆయన చెప్పుకొచ్చారు. యువన్ సినిమాలలో తాను ఎక్కువగా పాటలు పాడానని రఘు కుంచె పేర్కొన్నారు.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!