లాక్ డౌన్ లోనూ రివ్యూలపై మండిపడుతున్న దర్శకనిర్మాతలు

  • July 2, 2020 / 10:00 PM IST

“రివ్యూ” ఈ పదానికి వేల్యూ ఎంత ఉందో తెలియదు కానీ.. వేల్యూ బట్టి ఆ రివ్యూ అనేది మారుతుంది అనేది ఒప్పుకోవాల్సిన నిజం. ఈ రివ్యూ అనేది సినిమాలకు ఎప్పుడు పాజిటివ్ గానే ఉపయోగపడుతుంది. అంతే తప్ప చెడు చేసిన సందర్భం మాత్రం లేదనే చెప్పాలి. కానీ.. ఈ రివ్యూలను ఇండస్ట్రీ ఏకీపారేయడం అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది ఎందుకు అనేదానికి మాత్రం ఎవరి దగ్గరా సమాధానం లేదు. లాక్ డౌన్ కాలంలో రివ్యూల మీద దండయాత్రలు లేవు అని అందరు మర్చిపోతున్న తరుణంలో రివ్యూ అనే విషయాన్ని మళ్ళీ లేవనెత్తారు రఘు కుంచె & కొ.

రఘు కుంచె నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన చిత్రం “47 డేస్”. సత్యదేవ్, పూజా ఝవేరి, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 30న జీ5 యాప్ లో విడుదలైంది. ఎప్పట్లానే అన్నీ వెబ్ రిలీజులకు వచ్చినట్లు ఈ “47 డేస్”కి కూడా రకరకాల రివ్యూలు వచ్చాయి. రఘు కుంచె & కొ తెలిసినవాళ్లు పాజిటివ్ గా రాస్తే.. సినిమాను సినిమాగా చూసేవాళ్ళు నెగిటివ్ పాయింట్స్ లేవనెత్తి తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. దాంతో కోపమొచ్చిన రఘు కుంచె మరియు ఆయన సన్నిహితులు రివ్యూ రైటర్లపై విరుచుకుపడడం ప్రారంభించారు. అందరూ బ్రతికేదీ ఇండస్ట్రీ మీదే అని, అసలు నువ్వెవరు సినిమా చూడకూడదు అని రాయడానికి అని రకరకాలుగా విరుచుకుపడ్డారు.

సరే.. కోపాన్ని వెళ్ళగక్కారు బాగానే ఉంది. మరి ఇదే 47 డేస్ విడుదలకు కొన్నాళ్ళ ముందు “కృష్ణ అండ్ హిజ్ లీల” అనే మరో సినిమా విడుదలైనప్పుడు అదే రివ్యూ రైటర్లకు పేరుపెరుణా థ్యాంక్స్ చెప్పారుగా. కంటెంట్ లో దమ్ముండాలి కానీ.. ఇలా ఫేస్ బుక్ పోస్టులలో అవహేళన చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది రఘు కుంచె & కొ ఇష్టానికే వదిలేద్దాం. ఎందుకంటే.. రఘు కుంచె అనే గాయకుడు, సంగీత దర్శకుడు అంటే మాకు ఇష్టం. కానీ ఆయన నిర్మాతగా మాత్రం ఫెయిల్ అయ్యాడు అనే విషయాన్ని ఒప్పుకొంటేనే భవిష్యత్ లో ఆ తప్పులు సరిదిద్దుకోవచ్చు.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus