గత ఏడాది సంచలన సృష్టించిన శాండీల్ వుడ్ డ్రగ్స్ కేసులో ఇద్దరు హీరోయిన్స్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అందులో రాగిణీ ద్వివేది ఒకరు. హీరోయిన్ గా ఉన్నన్ని రోజులు విలాసవంతమైన జీవితాన్ని గడిపిన రాగిణీ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా పట్టుబడిన అనంతరం 145రోజుల పాటు జైలులో ఒక సాధారణ ఖైదీలా జీవితాన్ని గడిపింది. గత నెల బెయిల్ మంజూరు కావడంతో విడుదలైన ఆమె వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. జైలు నుంచి రాగానే రాగిణీ ఎక్కువగా ప్రైవసిని మెయింటైన్ చేస్తూ వచ్చింది.
అయితే చాలా రోజులకు ఆమె సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ తో ముచ్చటించింది. అయితే లైవ్ లోనే ఆమె ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకొని భావోద్వేగానికి గురయ్యింది. అందుకు కారణం సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ అని తన ఇంట్లో వాళ్ళను కూడా దూషించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నించింది. కామెంట్స్ చూస్తుంటే చాలా బాదేస్తోంది. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ కామెంట్స్ మీరు మళ్ళీ చుదువుకోండి.
ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళను అలా అంటే మీరు అన్న పదాలు ఎంత దారుణంగా ఉంటాయో మీకే అర్థమవుతుంది అని రాగిణీ వివరణ ఇచ్చింది. ఇక ప్రస్తుతం చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాను అంటూ తన సమస్యలను పూర్తిగా వివరించలేనని రాగిణీ వివరణ ఇచ్చింది.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?