‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతో జత కట్టింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాలు, హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. ఇవి కాకుండా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
గీతాఆర్ట్స్ సంస్థలో హీరోయిన్ కీలకపాత్రలో తెరకెక్కబోయే ఓ సినిమాకి రష్మిక ఓకే చెప్పిందట. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ కమ్ నటుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించబోతున్నాడు. గతంలో ‘చిలసౌ’ అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాను తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ‘మన్మథుడు 2’ సినిమాతో డిజాస్టర్ ను మూటకట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత రాహుల్ కి అవకాశాలు రాలేదు. దీంతో చాలా కాలంగా కథలు సిద్ధం చేసుకుంటున్నాడు.
ఫైనల్ గా ఓ కథతో గీతాఆర్ట్స్ నిర్మాతలను మెప్పించాడు. లేడీ ఓరియెంటెడ్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్ హీరోయిన్ గా రష్మికను ఫైనల్ చేసుకున్నారు. గతంలో ఇదే సంస్థలో ‘గీతా గోవిందం’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే అమ్మడుకి స్టార్ డమ్ వచ్చింది. మరి ఈసారి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!