Rahul Sipligunj: అతనికి ఆర్థిక సాయం ప్రకటించిన రాహుల్ సిప్లిగంజ్.. మంచి మనస్సంటూ?

  • January 3, 2024 / 03:05 PM IST

బిగ్ బాస్ షో విజేతగా నిలిచి ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో రాహుల్ సిప్లిగంజ్ ఒకరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే వాళ్లలో రాహుల్ సిప్లిగంజ్ ముందువరసలో ఉంటారు. ఇతరులకు సహాయం చేసే మంచి గుణం ఉన్న రాహుల్ సిప్లిగంజ్ చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. కష్టాల్లో ఉన్న వ్యక్తికి రాహుల్ సిప్లిగంజ్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.

ఒక సింగింగ్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న రాహుల్ సిప్లిగంజ్ కు ఆ పోటీలో పాల్గొన్న ఒక యువకుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల డెలివరీ బాయ్ గా పని చేస్తూ సంగీతం నేర్చుకుంటున్నాడని తెలిసింది. ఆ వ్యక్తి కష్టాలు విన్న వెంటనే ఎమోషనల్ అయిన రాహుల్ సిప్లిగంజ్ లక్ష రూపాయల సహాయం చేసి మంచి మనస్సును చాటుకున్నారు. రాహుల్ చేసిన మంచి పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

నాటు నాటు పాటతో ఇతర భాషల్లో సైతం పాపులర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ భవిష్యత్తులో కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా రాహుల్ సిప్లిగంజ్ ఒక్కో మెట్టు పైకి ఎదిగి ప్రశంసలు అందుకున్నారు. మాస్ పాటలు, తెలంగాణ యాస పాటలు అద్భుతంగా పాడే అతికొద్ది మంది సింగర్లలో రాహుల్ సిప్లిగంజ్ ఒకరు కావడం గమనార్హం.

ఆ కంటెస్టెంట్ గురించి రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ ఈ కంటెస్టెంట్ చాలా ఇన్ స్పైరింగ్ అని నేను ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానో నాకు తెలుసని రాహుల్ సిప్లిగంజ్ కామెంట్ చేశారు. నేను బార్బర్ గా పని చేశానని ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగానని కింది స్థాయి కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసని (Rahul Sipligunj) రాహుల్ సిప్లిగంజ్ కామెంట్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus