Rahul Sipligunj: ముంబై విధుల్లో ఆటో నడిపిన రాహుల్ సిప్లిగంజ్

  • December 21, 2021 / 07:06 PM IST

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల కాలంలో ఆర్ఆర్ఆర్ సాంగ్స్ తో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. మొదట ప్రైవేట్ సాంగ్స్ తో యూట్యూబ్ లో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న తర్వాత సినిమాల్ల్ అవకాశాలు అందుకున్నాడు. ఇక సోంతంగా క్రియేట్ చేసుకున్న ఆల్బమ్స్ క మంచి క్రేజ్ ఉండడంతో రాహుల్ సిప్లిగంజ్ కు జనాల్లో చాలా వేగంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

అంతే కాకుండా బిగ్ బాస్ మూడవ సీజన్ లో అతను టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల రాహుల్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను ముంబాయి వీధులలో అర్ధరాత్రి ఒక ఆటో నడిపిస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా రాహుల్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

అదే తనకు ఒక లాంబోర్గినీ అంటూ తన జీవితంలో ప్రత్యేకమైన పాత్ర పోషించినట్లు చెబుతూ చాలా విషయాలు నేర్చుకున్నాను అని కూడా పేర్కొన్నాడు. ఇక రాహుల్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో పాడిన నాటు నాటు సాంగ్ తో బాగా క్రేజ్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ వివిధ భాషలలో కూడా తనే ఆ పాటను పాడాడు. ముంబైలో ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్ళిన రాహుల్

అక్కడ ముంబై వీధుల్లో కాసేపు సరదాగా అలా చక్కర్లు కొట్టినట్లు తెలియజేశాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ముంబైలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus