Rahul Sipligunj: నిజమేంటో నాకు తెలుసు.. రాహుల్ ఆవేదన!
April 7, 2022 / 07:38 PM IST
|Follow Us
బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ బయటపడడం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో పబ్ యజమానులతో సహా దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకోగా.. వీరిలో సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉండడం సెన్సేషన్ అయింది. ఈ లిస్ట్ లో ప్రముఖ సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అలానే మెగాబ్రదర్ నాగబాబు కూతురు నీహారికతో పాటు పలువురు ఉన్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై నీహారిక తరఫున నాగబాబు ఓ వీడియో షేర్ చేశారు. తన కూతురు ఎలాంటి తప్పు చేయలేదని.. పోలీసులు కూడా అదే విషయాన్ని తెలిపారని నాగబాబు స్పష్టం చేశారు. అలానే రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాహుల్ స్పష్టం చేశారు. తన స్నేహితులతో సరదాగా పబ్ కి వెళ్తే.. తనపై నిందలు వేస్తున్నారని.. ఎలాంటి టెస్ట్ చేయించుకోవడానికైనా రెడీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.
అంతేకాదు.. తనకు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదని అన్నారు. రాహుల్ ఇంత చెప్పినప్పటికీ అతడిపై ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. రెగ్యులర్ గా పబ్ కి వెళ్లే అలవాటు ఉండడంతో రాహుల్ ని నిందిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ మేరకు రాహుల్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. ‘నన్ను నమ్మడానికి, నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరూ రెడీగా లేరు.
అయినప్పటికీ నా మీద నాకు నమ్మకం ఉంది. నిజం ఏంటో నాకు తెలుసు’ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు కొందరు ‘నిన్ను నమ్ముతున్నాం రాహుల్.. వి ఆర్ విత్ యు’ అంటూ రియాక్ట్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఈ విషయంలో రాహుల్ ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం రాహుల్ సింగర్ గా పాటలు పాడుతూనే కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నాడు.