కలం కదిపిన కిట్టుగాడు

  • October 24, 2016 / 08:30 AM IST

లఘు చిత్రాలు రాసుకుంటూ, తీసుకుంటూ ఉండే రాజ్ తరుణ్ సహాయ దర్శకుడిగా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడు. అటుపై అనుకోని రీతిలో నటుడిగా మారి హీరోగా సెటిలైపోయాడు. కలం కదిలించే శక్తి ఉన్నా ఇన్నాళ్లు తన సినిమాలకు ఆ పని చేయని ఈ వైజాగ్ కుర్రోడు ఇప్పుడో సినిమాకి తొలిసారిగా తన కలం కదిలించాడు. అదీ ఏకంగా ఓ పాటకోసం. రాజ్ తరుణ్ హీరోగా ఏకే ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ పై ‘కిట్టుగాడు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమ్మాయిలను టీజ్ చేస్తూ సాగే ఓ పాట ఉందట.

దానికోసం ఓ గేయ రచయితతో జరిపిన చర్చలు ఎంతకీ చిత్ర బృందానికి నచ్చడంలేదట. దాంతో పాట ఎలా ఉండాలో తెలిపేలా రాజ్ తరుణ్ కొన్ని వాఖ్యలు రాసి చిత్ర బృందానికి వినిపించాడట. అంతే.. అందరూ ఇతగాడి ప్రతిభను మెచ్చుకుంటూ ఈ పాట నువ్వే రాయాలని అభిమానపూర్వక ఆదేశాలు జారీ చేశారట. దాంతో ఈ హీరో కూడా ధైర్యం కూడగట్టుకుని పని కానిచ్చేశాడట. ఆడియో విడుదల వరకు ఈ విషయం బయటకు పొక్కనీయకూడదనుకున్నా ఒకరిద్దరి చెవిన ఆశ్రయం పొందిన ఈ మాట ఆ నోటా ఈ నోటా చేరి ఇలా బయటకొచ్చేసింది. హీరోలు కథలు రాయడం చూశాం పాటలు పాడడం విన్నాం ఇలా రాయడం మాత్రం రాజ్ తరుణ్ కె చెల్లింది కదూ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus