లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో..!

  • October 8, 2020 / 07:27 PM IST

ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరోల్లో నిఖిల్,నితిన్, రానా లు పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటి వారైన సంగతి తెలిసిందే.ఇదే జాబితాలో మరికొంత మంది యంగ్ హీరోలు కూడా చేరబోతున్నారు. నిహారిక మ్యారేజ్ అయిన వెంటనే వరుణ్ సందేశ్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నట్టు మెగా బ్రదర్ నాగబాబు ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. ఇక మెగా మేనల్లుడు సాయి తేజ్ కూడా పెళ్లికి రెడీ అవుతున్నాడు. తాజాగా రాజ్ తరుణ్ కూడా ఈ లిస్ట్ లో చేరినట్టు స్పష్టమవుతుంది.

ఈ మధ్యనే అతను నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం ఓటిటిలో విడుదలైన సంగతి తెలిసిందే.ఆ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు కానీ.. తక్కువ రేటుకు ‘ఆహా’ వారు కొనుగోలు చెయ్యడంతో సేఫ్ అయిపోయినట్టు తెలుస్తుంది. పక్కనే వచ్చిన అనుష్క ‘నిశ్శబ్దం’ చిత్రం కూడా ఫ్లాప్ అవ్వడంతో ‘ఒరేయ్ బుజ్జిగా’ టీం కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. రాజ్ తరుణ్ కూడా ప్రమోషన్లు చేస్తూ ఈ చిత్రాన్ని గట్టెక్కించాలని ట్రై చేస్తున్నాడు.

అందులో భాగంగా ఇటీవల ఓ టీవీషోలో పాల్గొన్నాడు. ఇదే క్రమంలో తన పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చేసాడు. ‘నిఖిల్‌ కు గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాల‌ని ఉండేది, కానీ క‌రోనా వల్ల సింపుల్‌గా చేసుకోవాల్సి వ‌చ్చింది. నేను కూడా ప్రేమ వివాహ‌మే చేసుకోబోతున్నాను. అయితే దానికి ఇంకా టైమ్ ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus