యువతని ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్ రంగుల రాట్నం ట్రైలర్

  • January 3, 2018 / 02:28 PM IST

అన్నపూర్ణ స్టూడియోస్.. రాజ్ తరుణ్ కలయికలో వచ్చిన మూవీ ఉయ్యాల జంపాల. ఈ సినిమాతో రాజ్ తరుణ్ మంచి పేరు తెచ్చుకున్నారు. మళ్లీ వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా రంగుల రాట్నం. శ్రీ రంజని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శుక్లా హీరోయిన్‌ గా పరిచయం అవుతోంది. ఈ మూవీ ట్రైలర్ నేడు రిలీజ్ అయి యువతని విశేషంగా ఆకట్టుకుంటోంది. “ఇష్టమైన అమ్మాయికోసం ఓ అబ్బాయి ఇష్టమైన వాటన్నిటినీ వదులుకోవడానికి ఇష్టపడుతాడు. ఆ వదులుకోవడంలో తనకు తానే కోల్పోయే స్థితికి వస్తాడు. అందుకే ఆ అమ్మాయిని వదులుకోవడానికి వెనుకాడడు. మరి ప్రేమించిన అమ్మాయికి దూరమయి తాను ఏమి కోల్పోయాడు.. చివరికి ఏ ఇష్టానికి దగ్గరయ్యాడు” అనే కథాంశంతో తెరకెక్కినట్లు ట్రైలర్ స్పష్టంగా వెల్లడించింది.

యువతకి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ని ఎంతో చక్కగా ఈ చిత్రంలో పొందుపరిచారు. ఈ సినిమాతో రాజ్ తరుణ తన ఖాతాలో మరో హిట్ సొంతం చేసుకుంటారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సంక్రాంతి పోరులో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, బాలకృష్ణ జై సింహా ఉన్నప్పటికీ సునాయాసంగా రాజ్ తరుణ్ రంగులరాట్నంతో లవ్లీ విజయాన్ని అందుకుంటారని అంచనా వేస్తున్నారు. గత ఏడాది పెద్ద పండుగ పోటీలో బాలయ్య, చిరు సినిమాలతో పాటు శర్వానంద్ శతమానం భవతి విజయం సాదించినట్టుగా.. ఈ ఏడాది ఈ చిన్న చిత్రం పెద్ద హిట్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus