‘ఒరేయ్ బుజ్జిగా’ డిజిటల్ రిలీజ్ బిజినెస్ వివరాలు.. తక్కువ రేటుకే ఇచ్చేసారుగా!
September 11, 2020 / 02:59 PM IST
|Follow Us
‘ఉయ్యాల జంపాల’ ‘సినిమా చూపిస్త మావ’ ‘కుమారి 21ఎఫ్’ వంటి హ్యాట్రిక్ హిట్లతో ఓ రేంజ్లో దూసుకొచ్చాడు హీరో రాజ్ తరుణ్. ఆ టైంలో కచ్చితంగా ఇతను స్టార్ అయిపోతాడు అని అంతా అనుకున్నారు. అయితే ఆ తరువాత నుండీ సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ‘ఈడో రకం ఆడో రకం’ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి సినిమాలు తప్ప.. రాజ్ తరుణ్ నటించిన అన్ని సినిమాలు ప్లాప్ అవ్వడంతో అతని రేంజ్ అమాంతం పడిపోయింది..! దిల్ రాజు నిర్మించిన ‘లవర్’ ‘ఇద్దరి లోకం ఒక్కటే’ వంటి చిత్రాలు కూడా పెద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ క్రమంలో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా తో ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం చేశాడు రాజ్ తరుణ్.
గతేడాది ‘ఖైదీ'(తమిళ్) వంటి హిట్ అందుకున్న కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో మొదట్లో కొద్దిపాటి అంచనాలు ఉండేవి. నిజానికి మార్చి 25న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకున్నారు కానీ.. కరోనా వల్ల ‘ఒరేయ్ బుజ్జిగా’ విడుదల కాలేదు. ఆ టైములో ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యమని 7.5 కోట్ల వరకూ ఆఫర్ వచ్చిందట. కానీ ఈ చిత్రాన్ని కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చెయ్యాలి అనే ఉద్దేశంతో నిర్మాతలు వెనకడుగు వేశారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రం పై ఉన్న క్రేజ్ మొత్తం తగ్గిపోయింది.
ఇప్పుడు ఈ చిత్రానికి ‘అమెజాన్ ప్రైమ్’ వంటి డిజిటల్ సంస్థలు 3కోట్ల నుండీ 3.5 కోట్ల వరకూ మాత్రమే ఆఫర్ చేస్తున్నాయట.ఈ టైములో అల్లు అరవింద్ గారి ‘ఆహా’ తరుపున 4 కోట్లు ఆఫర్ రావడంతో.. ‘ఒరేయ్ బుజ్జిగా’ టీం ఓకే చెప్పేసారట. అక్టోబర్ 2న ‘ఆహా’ లో ఈ చిత్రం విడుదల కానుందని కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్ సభ్యులు..!