ఓటిటి వల్ల గాడిలో పడ్డ రాజ్ తరుణ్ కెరీర్..!

  • November 4, 2020 / 05:33 PM IST

కెరీర్ ప్రారంభంలో ‘ఉయ్యాల జంపాల’ ‘సినిమా చూపిస్తా మావ’ ‘కుమారి 21f’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకుని మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు రాజ్ తరుణ్. ఆ తరువాత కూడా ‘ఆడో రకం ఈడో రకం’ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి చిత్రాలతో పర్వాలేదు అనిపించాడు. కానీ అటు తరువాత ఇతను నటించిన సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. దాంతో రాజ్ తరుణ్ సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘లవర్’ ‘ఇద్దరి లోకం ఒక్కటే’ వంటి చిత్రాలు కూడా డిజాస్టర్లు అయ్యాయి.

ఈ నేపధ్యంలో ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం ఇతనికి హెల్ప్ చేసింది. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కు నోచుకోలేదు. ఈ మధ్యలోనే ఓటిటిలో విడుదల చేసారు. సినిమాకి హిట్ టాక్ అయితే రాలేదు. కానీ ‘ఆహా’ ద్వారా ప్రమోషన్లు బాగా చెయ్యడంతో సేఫ్ అయిపోయింది. దీంతో ఈ హీరోతో మినిమం బడ్జెట్లో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ప్రస్తుతం రాజ్ తరుణ్ సినిమాలకు డిజిటల్ రైట్స్ 5 కోట్ల వరకూ పలుకుతున్నాయి.

డబ్బింగ్ మరియు శాటిలైట్స్ రైట్స్ రూపంలో మరో 2 కోట్ల వరకూ రాబడితే లాభాలు వచ్చినట్టే. అందుకే పలువురు ఎన్నారై నిర్మాతలు రాజ్ తరుణ్ తో సినిమాలు నిర్మించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus