రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు!

  • July 5, 2016 / 05:53 AM IST

గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ పై వచ్చినన్ని గాసిప్పులు ఏ ఇతర హీరో లేదా హీరోయిన్ పైనా వచ్చి ఉండవు. మనోడికి కెలుకుడు ఎక్కువైందని, అతడు నటించే సినిమాల్లో దర్శకుడ్ని పనిచేయనివ్వట్లేదని, అందుకే దర్శకులు కూడా మేము చేయలేం బాబోయ్ అని చేతులెట్టెస్తున్నారని.. ఇలా చాలా వార్తలొచ్చాయి. వెబ్ సైట్లలో మాత్రమే కాకుండా ప్రముఖ ఆంగ్ల పత్రికల్లోనూ ఈ కథనాలు వెలువడడంతో అందరూ నిజమే అనుకొన్నారు. రాజ్ తరుణ్ కూడా ఏమాత్రం స్పందించకపోవడం ఈ విషయానికి మరింత బలాన్నిచ్చింది.

ఇంకా సైలెంట్ గా ఉంటే కెరీర్ కి ప్రోబ్లం అవుతుందనుకొన్నాడో ఏమో తెలియదుగానీ.. ఒక్కసారిగా ట్విట్టర్ లో అన్నీ గాసిప్పులకి ఒక క్లారిటీ ఇచ్చేసి.. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాల వివరాలు కూడా చెప్పేశాడు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus