బాహుబలి కంక్లూజన్ ఒకచేత్తో కలెక్షన్లను, మరో చేత్తో రికార్డులను కొల్లగొట్టింది. ఇదివరకు ఏ భారతీయ చిత్రం సాధించిన 1500 కోట్ల మార్క్ ని దాటుకొని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. 250 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ ఆరు రెట్ల వసూళ్లు సాధించింది కదా.. నిర్మాతకు ఎంతో లాభం వచ్చి ఉంటుందని అనుకోవడం సహజం. కానీ దీనిపై దర్శకధీరుడు రాజమౌళి సమాధానం చూస్తే విస్తుపోవాల్సిందే. తాజాగా ఆయన ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కలక్షన్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “బాహుబలి 2 ఇంతవరకు 1500 కోట్లు దాటింది. 1580..1590 వరకు వచ్చాయి. చైనాలో రిలీజ్ చేయాల్సి ఉంది. చైనాలో వచ్చేది తక్కువే. అన్ని ఖర్చులుపోనూ 12.5 శాతమే చేతికొస్తుంది.” అని వివరించారు. దీంట్లో ప్రొడ్యూస్‌ర్‌కు సగమన్నా వస్తుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ .. “రాదు.. సినిమా నిర్మాణంలో డబ్బులు సంపాదించడం అన్నది చాలా కష్టం.
పాషన్‌తో తీయడమే. డైరెక్టర్‌కు డబ్బులొస్తాయి. హీరోకు, ఇతర ఆర్టిస్టులకు డబ్బులొస్తాయి. నిర్మాత డబ్బులు సంపాదించడం చాలా కష్టం. చాలా జాగ్రత్తగా ప్రొడక్షన్‌లో ఎంత మేనేజ్ చేశాం అన్నదాన్ని బట్టి డబ్బులు మిగుల్తాయే తప్ప, హిట్ అయి వస్తాయనుకోవడం వేరీ వేరీ రేర్. బాహుబలి కలెక్ట్ చేసిన డబ్బు 1500 కోట్లు. ఆంధ్రా అంతా అవుట్‌రైట్ అమ్మేశారు. ఎంతకమ్మేశారో అంతే వస్తుంది. అడిషనల్‌గా ఏమీరాదు. డిస్ట్రిబ్యూటర్ షేర్స్ ఉంటాయి. ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుంది. థియేటర్ రెంట్ ఉంటుంది. ట్యాక్స్ ఉంటుంది. ఈ లెక్కన నిర్మాతకు 500 కోట్లు మిగలడం కూడా కష్టమే” అని వివరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.