బాహుబలి 2 క్లైమాక్స్ విషయంలో ఇబ్బంది పడుతున్న రాజమౌళి!
March 9, 2017 / 01:30 PM IST
|Follow Us
సినిమాల్లో క్లైమాక్స్ సీన్ కీలకమైంది. ఆఖరి ఘట్టం బాగుంటే సినిమా హిట్ గ్యారంటీ. ఈ క్లైమాక్స్ లను అద్భుతంగా తెరకెక్కించంలో రాజమౌళి దిట్ట. స్టూడెంట్ నంబర్ వన్ నుంచి బాహుబలి ది బిగినింగ్ వరకు క్లైమాక్స్ సీన్స్ అదిరిపోతాయి. బాహుబలి కంక్లూజన్ లో కూడా అంతే రేంజ్ లో క్లైమాక్స్ ఉంటుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే బాహుబలి 2 కోసం దర్శకధీరుడు నాలుగు క్లైమాక్స్ లను చిత్రీకరించారని సమాచారం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని విషయం బయటికి తెలియకుండా ఉండేందుకు, కథకి అవసరం లేని సీన్లు, క్లైమాక్స్ సీన్లు షూట్ చేసినట్లు తెలిసింది. ఇలా చిత్ర బృందాన్ని కన్ఫ్యూజన్ లో పెట్టిన జక్కన్న.. ప్రస్తుతం తానే తికమక పడుతున్నట్లు టాక్.
చిత్రీకరించిన నాలుగు క్లైమాక్స్ సీన్స్ లో ఏది ఫైనల్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అతను నిర్ణయం చెప్పిన వెంటనే బాహుబలి 2 తొలి కాపీ సిద్దమయి పోతుందని వివరిస్తున్నారు. మరి రాజమౌళి నాలుగింటిలో మంచి సీన్ ఎంచుకోవడంలో ఎవరి సలహా తీసుకుంటారో, ఎప్పుడు నిర్ణయం చెబుతారోనని చిత్ర బృందం ఎదురుచూస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.