భయపడుతున్న రాజమౌళి!!!

  • August 1, 2016 / 07:03 AM IST

రాజమౌళి…ఫ్లాప్ అన్న పదం తెలియని దర్శకుడు….ఏ దర్శకుడు ఎలాంటి మార్గంలో వెళ్ళినా…తన మార్గం మాత్రం డిఫరెంట్ అంటాడు ఈ దర్శకుడు. అయితే అలాంటి రాజమౌళి ఎప్పుడూ లేనిది….మన బాహుబలి సినిమా సమయంలో చాలా భయపడ్డాడు. భారీ బడ్జెట్ సినిమా కావడం, పైగా ఆ సినిమాను ఫుల్ పబ్లిసిటీతో రిలీజ్ చెయ్యడం వెరసి సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అన్న భయాన్ని రాజమౌళి అప్పట్లో వ్యక్త పరిచాడు. అయితే ఊహించిన దానికన్నా ఎక్కువగా సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి. మన జక్కన్నకి టెన్షన్ తగ్గింది సేఫ్ జోన్ లో పడేసింది. అంతవరకూ బాగానే ఉంది అసలు చిక్కు ఇక్కడే మొదలయింది.

సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా రెండో పార్ట్…అదే బాహుబలి2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఆ అంచనాలను ఎక్కడా తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాడు మన జక్కన్న. అదే క్రమంలో ఆ సినిమా బిజినెస్ విషయంలో అప్పుడే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు….టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం…బాహుబ‌లి2 2017 ఏప్రిల్ 14న రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఆ సినిమా విదుదలకి 9 నెల‌లు వుండ‌గానే.. నిర్మాత‌ల చేత బిజినెస్ మొద‌లుపెట్టేసాడు మన జక్కన్న. అందులో భాగంగానే సినిమా టీజ‌ర్‌ను అద్భుతంగా త‌యారుచేసి.. బిజినెస్ చేస్తే..ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అని ఆలోచనలో ఉన్నాడు మన రాజమౌళి.

అయితే ఇదే క్రమంలో కేర‌ళ డ‌బ్బింగ్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు అమ్మేసిన‌ట్టు టాక్. ఇదిలా ఉంటే సినిమా విషయంలో జక్కన్న టెన్షన్ పడుతున్నాడు అని, ఏదో తెలియని భయంతోనే ముందుగా బిజినెస్ స్టార్ట్ చేశాడు అని అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ఏది ఏమైనా….బాహుబలి2 ఏమాత్రం తగ్గినా…కష్టమే…చూడాలి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus