బాహుబలి 2 పోస్టర్ లో మిస్టేక్ ని సరిదిద్దుకున్న రాజమౌళి
February 2, 2017 / 01:36 PM IST
|Follow Us
హడావుడిగా చేసే పనుల్లో తప్పులు దొర్లుతాయని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కి అర్ధమయింది. గణతంత్ర దినోత్సవం రోజున రిలీజ్ చేసిన బాహుబలి 2 పోస్టర్ తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసిందని ఆలస్యంగా తెలుసుకున్నారు. జనవరి 26న విడుదల చేసిన పోస్టర్ లో అమరేంద్ర బాహుబలి(ప్రభాస్)తో దేవసేన(అనుష్క) విల్లు పట్టుకొని బాణాలను గురిచూస్తున్న ఫోజు బాగుంది. అయితే ఇందులో అనుష్క, ప్రభాస్ విడివిడిగా విల్లు పట్టుకుని మూడు బాణాలను ఎక్కుపెట్టగా… ప్రభాస్ బాణాలు మూడింటిలో రెండు అనుష్క విల్లులో నుంచి వస్తున్నాయి. అలా రాకూడదు.
పోస్టర్ మేకింగ్ లో జరిగిన ఈ మిస్టేక్ ని గమనించకుండా జక్కన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజనుల విమర్శలు ఎదుర్కొన్నారు. పలు మీడియా సంస్థలు ఈ పోస్టర్ పై వీడియో రూపొందించి హంగామా సృష్టించింది. దీనిపై రాజమౌళి నేరుగా స్పందించలేదు. పోస్టర్ లో బాహుబలి బాణాలు, దేవసేన బాణాలు సక్రమంగా ఉండేలా మిస్టేక్ ని సరిజేసి తమ ఫేస్ బుక్, ట్విట్టర్ కవర్ పిశ్చర్ గా చిత్ర బృందం సెట్ జేసింది. ఇప్పటికైనా ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ముగుస్తుందని రాజమౌళి ఆశిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.