ఒక స్టార్ హీరోకి తనవంతు సాయం చేయనున్న దర్శక ధీరుడు రాజమౌళి

  • November 21, 2018 / 10:30 AM IST

ఇటీవలే ‘కేజీఎఫ్’ అనే ఒక కన్నడ సినిమా అదే పేరుతో తెలుగులో కూడా రీమేక్ అవుతుండగా కొద్దీ రోజుల క్రితం వచ్చిన ట్రైలర్ కి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని సాయికొర్రపాటి తెలుగులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ తో సినిమా పైన అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గట్టిగ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాకి డైరెక్టర్ రాజమౌళి కూడా తనవంతు సాయం చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ‘కేజీఎఫ్’ సినిమాకి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సాయికొర్రపాటి ఇంకా రాజమౌళి ఇద్దరు కూడా మంచి స్నేహితులు కావడంతో ఆయన నిర్మించే సినిమాలకి రాజమౌళి ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు. అందుకే ‘కేజీఎఫ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి రానునట్లుగా తెలుస్తుంది. జక్కన్న ఈ సినిమా గురించి కొంచెం మాట్లాడిన ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వడమే కాకుండా సినిమా పైన మరిన్ని అంచనాలు పెరుగుతాయి. ఇక కన్నడ స్టార్ హీరో యష్ ని తెలుగు ప్రేక్షకులకు ప్రీ రిలీజ్ లో రాజమౌళి పరిచయం చేయబోనున్నాడు. మరి రాజమౌళి అంతటి డైరెక్టర్ ఇలా వచ్చి కన్నడ హీరో యష్ కి సాయం చేస్తుంటే ఈ స్టార్ హీరో తెలుగులో ఎలాంటి క్రేజ్ సంపాదిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus