Jr NTR, Rajamouli: ఎన్టీఆర్ షోలో సందడి చేయనున్న రాజమౌళి!

  • August 31, 2021 / 09:28 PM IST

ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి తీస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని పేట్రియాటిక్ మూవీ గా కమర్షియల్, యాక్షన్ ఎమోషనల్ అంశాల మేళవింపుగా రాజమౌళి ఎంతో అద్భుతంగా తీసినట్లు సమాచారం . బాలీవుడ్ నటుడు అజయ్ దేవిగన్,

కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఓవైపు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మ్యాటర్ ఏమిటంటే, నేడు కొద్దిసేపటి క్రితం రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్ కి రావడంతో అక్కడి కొందరు ఆయనని తమ వీడియో లో బంధించారు. మరి సడన్ గా రాజమౌళి అక్కడ మెరిశారు అంటే ప్రస్తుతం అక్కడే షూట్ జరుగుతున్న ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న స్పెషల్ షో మీలో ఎవరు కోటీశ్వరుడు కి రాజమౌళి గెస్ట్ గా రానున్నారా

అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తుండగా, ఆర్ఆర్ఆర్ మూవీ కి సంబంధించి ప్యాచ్ వర్క్ కొంత పెండింగ్ ఉండడంతోనే దాని నిమిత్తం రాజమౌళి అన్నపూర్ణ స్టూడియో కి వచ్చారని మరికొందరు అంటున్నారు. మరి రాజమౌళి ఇంతకీ అన్నపూర్ణ కి ఎందుకెళ్ళారు అనే దానిపై పూర్తి స్పష్టత రావాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus