తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. లాక్ డౌన్ తరువాత షూటింగ్ మొదలుపెట్టడానికి రెడీ అయ్యారు చిత్ర యూనిట్ సభ్యులు. 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ బిజినెస్ డీల్ ఈ మధ్యనే క్లోజ్ అయిపోయిందని వినికిడి. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఆర్.ఆర్.ఆర్’ శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ అన్ని భాషల్లో కలిపి 200కోట్లకు అమ్మారని తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే.. బడ్జెట్లో దాదాపు సగం వరకూ రికవర్ అయిపోయినట్టే అని చెప్పాలి.అంతేకాకుండా .. ఇప్పటి వరకూ ఓ ఇండియన్ సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ఇంత పెద్ద మొత్తం ఆఫర్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.
కాబట్టి ఆ విషయంలో ‘ఆర్.ఆర్.ఆర్’ అప్పుడే రికార్డ్ సృష్టించినట్టే.! ఇదిలా ఉండగా.. చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలయ్యి యూట్యూబ్లో రికార్డులు నెలకొల్పింది. ఇక అక్టోబర్ 22న ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!