ఇండైరెక్ట్ గా డైరక్టర్ పేరు చెప్పిన రాజశేఖర్

  • June 29, 2018 / 01:09 PM IST

యాక్షన్ చిత్రాల్లో నటించి డాక్టర్ రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. కొన్నేళ్లుగా హిట్ లేకపోవడంతో తెరమరుగు అయిపోతారని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలు బీట్ చేస్తూ పీఎస్వీ గరుడ వేగ తో దూసుకువచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రాజశేఖర్ కి పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టింది. తర్వాత ఏ సినిమా చేస్తారనే దానిపై అనేక గాసిప్స్ వచ్చాయి. విలన్ గా నటిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ అతను హీరోగానే కొనసాగడానికి కథలను విన్నారు. డైరెక్టర్ మణిరత్నం దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన గోపి చెప్పిన లైన్ బాగుండడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ స్క్రిప్ట్ ఆలస్యం కావడంతో మరో డైరక్టర్ కి ఒకే చెప్పారు.

ఆ విషయాన్నీ ఇండైరెక్ట్ గా చెప్పారు. “నా తర్వాతి సినిమా అదేనని చెప్పడానికి సంతోషిస్తున్న అది ఎలా ఉంటుందంటే…. అ!ద్భుతంగా ఉంటుంది” అని ట్వీట్ చేశారు. తన తర్వాతి సినిమా “AWEsome ” అంటూ పేర్కొన్న అయన మొదటి మూడు అక్షరాలను ప్రత్యేకంగా రాయడం వెనుక దర్శకుడు ఎవరో చెప్పకనే చెప్పేశారు. “AWE (అ!) మూవీతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు ప్రశాంత వర్మ దర్శకత్వంలోనే రాజశేఖర్ నటిస్తున్నట్లు స్పష్టమయింది. మరి ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus