ఎంత మంది విజయ్ దేవరకొండలు వచ్చినా నేను ఇక్కడే ఉంటాను: రాజశేఖర్
July 8, 2019 / 12:43 PM IST
|Follow Us
మన యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఎంత మంచి నటుడు, మంచి భర్త, మంచి తండ్రి అయినప్పటికీ.. ఆయన వాక్చాతుర్యం విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు అభాసుపాలవుతూనే ఉంటాడు. ఒక్కోసారి సరిగా మాట్లాడడం రాక నవ్వులపాలైతే.. ఇంకొన్ని సార్లు సభకు సంబంధం లేని విషయాలు మాట్లాడి అవమాన పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ.. నిన్న జరిగిన “దొరసాని” ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాత్రం రాజశేఖర్ స్పీచ్ అందర్నీ ఆకట్టుకొంది.
తన కుమార్తె నెపోటిజంను నమ్ముకొని రాలేదని, తన కష్టాన్ని నమ్ముకొని వచ్చిందని, ఆమెకు మా ఫ్యామిలీ నుంచి పెద్దగా సపోర్ట్ చేసిందేమీ లేదు అని చెప్పుకొచ్చిన రాజశేఖర్.. ఇదే సందర్భంలో విజయ్ దేవరకొండను చూసి “స్టేజ్ మీద భయం లేకుండా ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను” అని చెప్పడం అదే సందర్భంలో ఆనంద్ దేవరకొం తన క్లాస్ మేట్ అని చెప్పడం వంటి విషయాలను ఆహుతులను అలరించాయి. 14 నిమిషాల రాజశేఖర్ స్పీచ్ విన్నవాళ్ళందరూ.. చాలారోజుల తర్వాత రాజశేఖర్ చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడారు కదా అనుకోవడం విశేషం.