Rajashekar Remuneration: వామ్మో.. రాజశేఖర్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

  • August 15, 2021 / 09:54 PM IST

సీనియర్ హీరో రాజశేఖర్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో గరుడవేగ మినహా మరో సినిమా హిట్ కాలేదు. సినిమాసినిమాకు రాజశేఖర్ మార్కెట్ కూడా తగ్గుతుండటం గమనార్హం. ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా “శేఖర్” పేరుతో ఒక సినిమా తెరకెక్కుతుండగా గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో సైతం రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రాజశేఖర్ ఏకంగా 4 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని సమాచారం.

గోపీచంద్ అన్న పాత్రలో రాజశేఖర్ ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. దర్శకుడు శ్రీవాస్ కు ఈ సినిమాలో తన పాత్ర గౌరవప్రదంగా ఉండాలని తన్నులు తినడం లాంటి సీన్లు ఉండకూడదని రాజశేఖర్ షరతులు విధించినట్టు భోగట్టా. చిత్రయూనిట్ అన్ని షరతులకు ఒప్పుకుని రాజశేఖర్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. గోపీచంద్ తో రాజశేఖర్ నటిస్తున్న సినిమా హిట్టైతే జగపతిబాబులా రాజశేఖర్ కు కూడా సినిమా ఆఫర్లు పెరిగే అవకాశాలు ఉంటాయి.

గోపీచంద్ కాంబోలో మూవీ తర్వాత రాజశేఖర్ వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది. సీనియర్ హీరో ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం సాధారణ విషయం కాదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. హీరో పాత్రలు తప్ప ఇతర పాత్రలు చేయకూడదని నిర్ణయం తీసుకున్న రాజశేఖర్ తన నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం. స్టార్ హీరోలు పారితోషికాలను భారీగా పెంచేయడంతో మిడిల్ రేంజ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా పారితోషికాలను పెంచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని గోపీచంద్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus