Rajashekar: ‘శేఖర్’ సినిమాలో కూతురు పాత్రపై రాజశేఖర్ ఏం చెప్పారంటే?
May 21, 2022 / 11:26 AM IST
|Follow Us
తండ్రీ, కూతురు కలసి నటిస్తే చూడటానికి రెండు కళ్లూ చాలవు అంటారు. గతంలో చాలామంది ఇలా కలసి నటించి అభిమానుల్ని అలరించారు. ఇది ఫ్యాన్స్ వైపు నుండి. అదే ఆ యాక్టర్స్ వైపు నుండి చూస్తే… తండ్రి నటించాలని కూతురికి కూడా ఉంటుంది. కానీ అలాంటి ఓ అవకాశాన్ని ఓ కూతురు వదలుకుంది అంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది. రాజశేఖర్ – శివాత్మిక గురించే మేం చెబుతున్నది. రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్’.
ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. రాజశేఖర్ పోషించిన శేఖర పాత్ర సినిమాలో ఎంత కీలకమో, అతని కూతురిగా నటించిన శివానీకి మంచి పేరొచ్చింది. అయితే ఆ పేరు రావాల్సింది శివానీకి శివాత్మికకట. ఈ విషయాన్ని రాజశేఖరే చెప్పారు. సినిమా ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ కీలక విషయాన్ని చెప్పారు రాజశేఖర్. ‘శేఖర్’ సినిమాలోని కూతురు పాత్ర కోసం వేరే నటిని తీసుకుందామని తొలుత చెప్పారట రాజశేఖర్.
కానీ ఆయన ఆలోచనకు దర్శకురాలు జీవిత ఒప్పుకోలేదట. ఇద్దరి పిల్లల్లో ఎవరో ఒకరు చేస్తే బాగుంటుందని ఆమె అనుకున్నారట. దీంతో ‘మీ ఇద్దరిలో ఎవరు నటిస్తారు’ అని శివానీ, శివాత్మికను రాజశేఖర్ అడిగారట. ‘నేను నీతో తర్వాత నటిస్తాను’ అని శివాత్మిక తప్పుకుందట. దాంతో ఆ పాత్రలోకి శివానీ వచ్చింది అని రాజశేఖర్ చెప్పారు. తొలుత ‘శేఖర్’ సినిమాకు వేరే దర్శకులను అనుకున్నారు. ఒకరిద్దరు దర్శకులు మారి..
ఆఖరి మెగా ఫోన్‌ను జీవితనే పట్టుకున్నారు. మరి సెట్స్‌లో ఎలా ఉండేది పరిస్థితి అని రాజశేఖర్‌ని అడిగితే.. సెట్స్‌లో డైరెక్టర్- నటుడిగానే ఉండేవాళ్లం అని చెప్పారు రాజశేఖర్. దర్శకురాలిగా సన్నివేశానికి ఏం కావాలో జీవిత వివరించేవారట. ఆ ఇన్‌పుట్స్‌తో ఆయన నటించేవారట. ఒక్కోసారి ఇద్దరం చర్చించుకుని, ఎవరి ఆలోచన బాగుంటే అదే ఫాలో అయ్యేవాళ్లట. తను గొప్ప డైరెక్టర్ అనేది రాజశేఖర్ మాట.