Rajendra Prasad: సినిమాల్లోకి రావడానికి రాజేంద్ర ప్రసాద్ ఎంత కష్టపడ్డారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
July 15, 2023 / 02:07 PM IST
|Follow Us
టాలీవుడ్ లో మొట్టమొదటి కామెడీ హీరో గా సరికొత్త ట్రెండ్ ని సృష్టించి చరిత్ర తిరగరాసిన హీరో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అప్పట్లో కామెడీ హీరో గా ఆయన సాధించిన విజయాలు మామూలివి కాదు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు అప్పట్లో ఏ రేంజ్ వసూళ్లు వచ్చేవో, ఆ రేంజ్ వసూళ్లు రాజేంద్ర ప్రసాద్ కి కూడా వచ్చేవి. కేవలం కామెడీ హీరోగా మాత్రమే కాకుండా, సహాయ నటుడిగా కూడా ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించాడు.
ఇప్పటికీ కూడా సహాయ నటుడిగా (Rajendra Prasad) రాజేంద్ర ప్రసాద్ కి టాలీవుడ్ లో ఏ రేంజ్ డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ స్థాయి రాజేంద్ర ప్రసాద్ కి ఊరికే రాలేదు, దాని వెనుక ఆయన పడిన కష్టాలు మరువలేనివి. రాజేంద్ర ప్రసాద్ నిమ్మకూరు గ్రామానికి చెందిన వ్యక్తి, ఇదే గ్రామం లో స్వర్గీయ నందమూరి తారకరామారావు జన్మించాడు. అప్పట్లో ఆయన పలు ముఖ్యమైన ఈవెంట్స్ లో మిమిక్రీ ఆర్టిస్టుగా వ్యవహరించేవాడు.
అలా ఒక ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ రాజేంద్ర ప్రసాద్ లోని టాలెంట్ గుర్తించి, సినిమాల్లోకి వచ్చేయ్, ముందు చెన్నై లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకో అని సలహా ఇచ్చాడు. ఎన్టీఆర్ ఇచ్చిన సలహాని పాటిస్తూ, రాజేంద్ర ప్రసాద్ చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ నేర్చుకొని, ఆ స్కూల్ లో గోల్డ్ మెడల్ ని కూడా సంపాదించాడు. కానీ ఆ తర్వాత ఆయన సినిమాల్లో అవకాశాలు సంపాదించడం కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇంటి నుండి తెచ్చుకున్న డబ్బులు అయిపోయి, ఆకలితో అలమటించిన రోజులు అవి.
ఫిలిం స్టూడియోస్ చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరిగినా కూడా అవకాశాలు రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకున్నాడు అట. ఆ సమయం లో తనకి ఎంతో సన్నిహితుడైన అబ్బూరి పుండరీకాక్షయ్య ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘మేలుకొలుపు’ అనే సినిమాలో ఒక తమిళ ఆర్టిస్టుకి డబ్బింగ్ చెప్పేందుకు కోసం రాజేంద్ర ప్రసాద్ ని తీసుకున్నాడు. అలా ఒక డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించిన రాజేంద్ర ప్రసాద్ చిన్నగా సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు ఈ స్థాయిలో ఉన్నాడు.