నా డ్రీం రోల్ అదే : రజినీ..!

  • December 17, 2019 / 06:35 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’. ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నయన తార హీరోయిన్ గా నటిస్తోంది. నివేదా థామస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో రజినీ ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. రజినీ నుండీ అభిమానులు ఎక్ష్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్నీ ఈ ట్రైలర్ లో పుష్కలంగా ఉన్నాయి.

ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో రజినీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రజినీ మాట్లాడుతూ.. “నాకు పోలీస్ పాత్రలు చేయడం నచ్చదు. అలాంటి పాత్ర చేయాలంటే చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. నాకు సులభంగా చేసే పాత్రలంటే ఇష్టం కానీ మురుగదాస్ వైవిధ్యమైన కథతో నా దగ్గరకి వచ్చాడు కాబట్టి ఒప్పుకున్నాను. ఇప్పటివరకు చాలా జోనర్స్ లో సినిమాలు చేశాను కానీ నా డ్రీమ్ రోల్ మాత్రం చేయలేకపోయాను. ఇప్పటివరకూ దాదాపు 160 సినిమాలు చేశాను, 45 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను కానీ డ్రీమ్ రోల్ మాత్రం చేయలేకపోయాను. నా డ్రీం రోల్ ఏంటంటే.. ‘ట్రాన్స్‌జెండర్’ క్యారెక్టర్ చెయ్యాలనేది. వెండితెర పై ట్రాన్స్‌జెండర్ గా కనిపించాలనేది నా కోరిక” అని చెప్పుకొచ్చాడు. నిజానికి రజినీ ఎంత గొప్ప వ్యక్తి అనేది ఈ కామెంట్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన వీరాభిమానులు మాత్రం ఈ కామెంట్స్ ను జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఇదేం కోరిక తలైవా’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus