సూపర్ స్టార్ రజినీకాంత్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే ప్రతీ ఏడాది నిర్వహించే సాధారణ హెల్త్ చెకప్ లో భాగంగానే ఆయన హాస్పిటల్ కి వెళ్లారని.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన భార్య చెప్పారు. రెండురోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన రజినీకాంత్ బుధవారం రాత్రి తాను నటించిన ‘అన్నాత్తే’ సినిమాను కుటుంబసభ్యులతో కలిసి చూశారు. గురువారం సాయంత్రం ఉన్నట్టుంది ఆయన చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో చేరారు.
విషయం బయటకు పొక్కడంతో రజినీకాంత్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ స్పందిస్తూ.. రజినీకాంత్ ఎప్పటిలానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే హాస్పిటల్ లో చేరారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే అని అన్నారు. ఆయన కొన్ని గంటల తరువాత ఇంటికి వస్తారని మొదట అనుకున్నారు.
అయితే శుక్రవారం పూర్తిగా వైద్యుల పర్యవేక్షలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. గురువారం నాడు రజినీకాంత్ ను చూడడానికి ఆయన కూతురు ఐశ్వర్య.. కావేరి హాస్పిటల్ కి వచ్చారు.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?