Rajinikanth: ఆరెంజ్‌ ఆర్మీ గురించి రజనీకాంత్‌ కామెంట్స్‌… ఆమె కన్నీరు చూడలేనంటూ…

  • July 30, 2023 / 05:30 PM IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన అభిమానుల్ని ముద్దుగా ఆరెంజ్‌ ఆర్మీ అని పిలుస్తూ ఉంటుంది. ఆ జట్టు ఐపీఎల్‌లో సరైన విజయం అందుకోకపోయినా, కప్‌ కొట్టకపోయినా ఫ్యాన్స్‌ మాత్రం ఆ జట్టును సపోర్ట్‌ చేస్తూనే ఉన్నారు. అయితే హైదరాబాద్‌ ఓడిపోయినప్పుడల్లా అభిమానులు ఎంత బాధపడతారో తెలియదు కానీ… ఆ జట్టు యజమాని అయిన కావ్య మారన్‌ మాత్రం చాలా బాధపడుతుంది. ఆమె ఒక్కోసారి కన్నీళ్లు పెట్టుకోవడం కూడా చూసుంటారు. దీని గురించి తలైవా రజనీకాంత్‌ ఇటీవల మాట్లాడారు.

రజనీ ఐపీఎల్‌ చూస్తారా? అందులోనూ ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ చూస్తారా? కావ్య మారన్‌ ఏడవడం గురించి ఎందుకు మాట్లాడారు అనే డౌట్‌ వస్తోందా? మీ డౌట్స్‌కి ఆన్సర్‌ మేం చెబుతాంగా. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ యజమాని సన్‌ టీవీ వాళ్లే అనే విషయం తెలిసిందే. వాళ్లు నిర్మిస్తున్న రజనీకాంత్‌ సినిమా ‘జైలర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగింది. ఆ వేదిక మీద రజనీకాంత్‌ ‘హైదరాబాద్‌’ గురించి మాట్లాడాడు. అందులో భాగంగానే కావ్య మారన్‌ కన్నీళ్లు పెట్టుకోవడం గురించి కూడా చెప్పాడు.

ఐపీఎల్‌లో హైదరాబాద్ ఓడిపోయినప్పుడల్లా కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండటం టీవీలో చూశాను. ఆమెను అలా చూడటం బాధగా ఉంటుంది. దాంతో చానల్ మార్చేసేవాణ్ని. ఈ ఇబ్బంది లేకుండా ఎస్‌ఆర్‌హెచ్‌లో మంచి ప్లేయర్లని పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. ఆట మీద కసి ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వండి అని హైదరాబాద్‌ యాజమాన్యానికి రజనీకాంత్‌ సూచించాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ యాక్టివ్‌ అయ్యారు. తలైవా చెప్పిన మాటైనా విని జట్టును మార్చుకోండి అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యాన్ని కోరుతున్నారు.

ఇక ‘జైలర్’ సినిమా విషయానికొస్తే (Rajinikanth) రజనీకాంత్‌, తమన్నా ప్రధాన పాత్రల్లో సినిమా రూపొందుతోంది. నెల్సన్ దిలీప్ దర్శకుడు. ఆగస్టు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన లుక్స్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus