అజిత్ ని కాపీ కొట్టిన రజనీ!

  • June 30, 2016 / 08:25 AM IST

సౌత్ సినిమాకు “సాల్ట్ అండ్ పెప్పర్ లుక్”ను పరిచయం చేసిందే అజిత్. ఆ తర్వాత తాను నటించిన అన్నీ సినిమాల్లోనూ అదే లుక్ తో అలరించాడు. “కబాలి” సినిమాలో రజనీ స్రైల్ అజిత్ “సాల్ట్ అండ్ పెప్పర్ లుక్”ను పోలి ఉంటుంది.

అదే ధోరణిలో అజిత్ ను మరోమారు కాపీ కొడుతున్నాడు రజనీకాంత్. “వేదాలమ్” సినిమా టీజర్ మినహా ఏ ఇతర కంటెంట్ ను విడుదల చేయలేదు. డిస్ట్రిబ్యూటర్లు సినిమా చూడకుండానే కొనేశారు, సినిమా సూపర్ హిట్ అయిపోయింది. “వేదాలమ్” ప్రమోషన్ టెక్నిక్ నే తన సినిమా కోసం వాడేస్తున్నాడు రజనీకాంత్. అందుకే తన తాజా చిత్రం “కబాలి” సినిమాకి సంబంధించిన టీజర్ మినహా ట్రైలర్ ను కూడా విడుదల చేయలేదు. సాంగ్ ప్రోమోస్ లో కూడా ఇంట్రో సాంగ్ ఒక్కటే బయటకు వచ్చింది. మరి “కబాలి” కూడా “వేదాలమ్”లా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus