బాలయ్య పుస్తకం చదువుతున్న రజనీ..!!

  • August 1, 2016 / 01:15 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ బాలయ్య పుస్తకం చదివారు. అవును కబాలి చిత్రంలో రజనీ చేతిలో ఆ పుస్తకమే ఉంటుంది. ఆ చిత్రంలోని స్టిల్ ఇప్పుడు నెట్ లో బాగా షేర్లు అందుకుంటున్నాయి. నందమూరి బాలకృష్ణ పుస్తకం సూపర్ స్టార్ చదవడం ఏమిటి ? అని నెటిజనులు ఆశ్చర్యంగా ఫోటోని తిలకించి .. అసలు విషయం తెలుసుకొని కూల్ అవుతున్నారు. ‘మా నాన్న బాలయ్య’ పేరుతో ఉన్న పుస్తకాన్ని రజనీ కబాలి సినిమాలో చదువుతూ కనిపిస్తారు.

అది కొన్ని క్షణాలు మాత్రమే. అయితే ఆ పుస్తకం నటసింహ బాలకృష్ణ గురించి కాదు. 1700 కాలంలో అంటరాని తనం ఎలా ఉండేదో ? తెలుపుతూ ఓ దళితుడు రాసిన పుస్తకం. ఆ పుస్తకం ద్వారా స్ఫూర్తి పొంది దర్శకుడు పా. రంజిత్ కబాలి ని మలిచారు. ఆ కృతజ్ఞత భావంతో ఆ పుస్తకాన్ని రజనీ చదివేలా షూట్ చేశారు. ఆ విషయాన్నివివరించకుండా “బాలయ్య పుస్తకాన్ని చదివిన రజనీ” అంటూ నెట్ లో కొందరు పోస్ట్ చేసి ఫన్ ని క్రియేట్ చేస్తున్నారు. సోమవారం సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన పోస్ట్ ల్లో ఇది ముందు వరుసలో నిలిచింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus