పుట్టినరోజున పొలిటికల్ పార్టీ ప్రకటించనున్న రజనీకాంత్!
November 10, 2017 / 03:18 PM IST
|Follow Us
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన కోసం లక్షలాది మంది తమిళీయులు ఎదురుచూస్తున్నారు. అతను రాజకీయాల్లోకి వచ్చి సేవలు అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒంటరిగా రావాలా? పొత్తుతో రావాలా ? … ఏ విధంగా అడుగు పెట్టాలో నిర్ణయం తీసుకోవడానికి ఇన్నేళ్ళుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఏడాది మే లో అభిమానులను రజనీ కలుసుకున్నారు. అప్పుడే పార్టీ ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు.
కానీ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రస్తావిస్తూ తన భవిష్యత్తును ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని చెప్పారు. అయితే కోలీవుడ్ సమాచారం మేరకు రజనీ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయినట్లు తెలిసింది. ఆయన పుట్టిన రోజైన డిసెంబర్ 12 న రాజకీయ పార్టీ ప్రకటిస్తారని టాక్. పార్టీ ప్రకటన అనంతరం తమిళనాడు మొత్తం పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తమిళ మీడియా వెల్లడించింది. అలాగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వివరించింది. ఈ సమయంలో అతను ఏ కేంద్ర పార్టీకి మద్దతు పలుకుతారు? అనేది ఆసక్తికరంగా మారింది.