గాడ్ బ్లెస్ యు డియర్.. సురేఖ, రజిత పోస్టులు వైరల్..!

  • April 19, 2022 / 04:43 PM IST

రాజా రవీంద్ర అందరికీ సుపరిచితుడే. కెరీర్ ప్రారంభంలో కన్నడ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించేవాడు. తెలుగులో కూడా నటించినా అవి అంతగా గుర్తుండిపోయే పాత్రలు కాదు. సినిమాల్లోనే కాదు, బుల్లితెరపై కూడా ఈయన చాలా సీరియల్స్ లో నటించారు. ఇప్పటివరకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించిన ఈయన ప్రస్తుతం విలక్షణమైన పాత్రలతో సినిమాల్లో దర్శనమిస్తూనే మరోపక్క కొంతమంది టాప్ స్టార్లకి మేనేజర్ గా వ్యవహరిస్తూ ఉంటారు.

Click Here To Watch NOW

గతంలో రవితేజకి కూడా మేనేజర్ గా చేశారు. అయితే అతని వద్ద ఎందుకు మానేసాడు అనే విషయాన్ని ఇతను యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పి అప్పటి నుండీ యూట్యూబ్ లో మరింతగా ట్రెండ్ అవుతున్నాడు. ఇదిలా ఉండగా.. నిన్న అంటే ఏప్రిల్ 18న ఇతని పుట్టినరోజు. దీంతో ఇండస్ట్రీలో ఉన్న ఇతని స్నేహితులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో సురేఖ వాణి, రజిత వంటి నటీమణులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఎందుకంటే సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకి ఫాలోవర్ల సంఖ్య ఎక్కువ. అందులోనూ ‘హ్యాపీ బర్త్ డే టు మై డియరెస్ట్ ఫ్రెండ్.. మై వెల్విషర్.. రాజా రవీంద్ర కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. గాడ్ బ్లెస్ యూ డియర్ అంటూ సురేఖా వాణి చాలా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. ఇక రజిత అయితే ‘హ్యాపీ బర్త్ డే రాజా’ అంటూ పోస్ట్ పెట్టింది.

వీళ్ళ పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజా రవీంద్ర ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ అత్యంత సన్నిహితుడు. హేమ, సురేఖ, రజిత వంటి వారంతా ఓ టీం. ఎవరింట్లో ఏ వేడుక జరిగినా వెంటనే హాజరైపోతూ ఉంటారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus