రజనీ నెక్స్ట్ సినిమా కూడా పోలిటికల్ కాన్సెప్తే

  • February 6, 2019 / 11:46 AM IST

ఆయన కోరుకోకపోయినా ప్రేక్షకులే ఆయన్ని తమ హృదయపు సింహాసనంలో కూర్చోబెట్టారు. కానీ.. రజనీకాంత్ మాత్రం ఆ సింహాసనం వద్దు అంటూ రాజకీయాల్లోకి వెళ్లనున్నాడు. అయితే.. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళేది మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ కోసమేనని స్పష్టం చేస్తున్నాడు రజనీకాంత్. అదెలా అనుకుంటున్నారా.. మురుగదాస్ చిత్రంలో తాను నటించబోయే తదుపరి చిత్రం ద్వారా. సినిమాతో కన్ఫర్మేషన్ ఎలా అని మళ్ళీ అనుకుంటున్నారా?

ఆగండాగండి.. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి “కుర్చీ” అనే టైటిల్ ను రిజిష్టర్ చేశారు. దాంతో నిన్నమొన్నటివరకూ ఈ సినిమాలో రజనీ పోలీస్ గా కనిపించనున్నాడని వచ్చిన వార్తలన్నీ అబద్ధమే అని కన్ఫర్మ్ అయ్యింది. అలాగే.. రజనీ-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కేది పోలిటికల్ సినిమా అని కూడా స్పష్టమైంది. ఆల్రెడీ రజనీ ఈ తరహా పోలిటికల్ సినిమాలైన “కబాలి, కాలా”తో డిజాస్టర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆయన అభిమానులు ఇప్పుడు మళ్ళీ కంగారుపడడం మొదలెట్టారు. మరి ఈ సినిమా ఏమవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus