డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయిన సినిమాకి సీక్వెల్ ఎందుకు
June 27, 2019 / 02:47 PM IST
|Follow Us
ఒక సినిమా మరీ సూపర్ హిట్ అయితే తప్ప ఆ సినిమాకి సీక్వెల్ తీయడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు ఇదివరకు దర్శకనిర్మాతలు. కానీ.. ఈమధ్య సీక్వెల్స్ తీయడానికి హిట్/ఫ్లాప్ తో సంబంధం లేకుండాపోయింది. రీసెంట్ గా వచ్చిన “అభినేత్రి 2” అందుకు ఉదాహరణ. మొదటి పార్ట్ “అభినేత్రి” బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడినా కూడా సెకండ్ పార్ట్ తీసి అంతకుమించిన డిజాస్టర్ అందుకున్నాడనుకోండి. ఇప్పుడు అదే తరహాలో రాజశేఖర్ కూడా తన ప్రీవీయస్ ఫిలిమ్ “పిఎస్వీ గరుడ వేగ” చిత్రానికి సీక్వెల్ ను ఎనౌన్స్ చేశాడు.
విషయం ఏంటంటే.. “పి.ఎస్.వి గరుడ” వేగ చిత్రానికి పాజిటివ్ టాక్ తోపాటు మంచి రివ్యూలు కూడా వచ్చినప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రం లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. పైపెచ్చు 11 కోట్లకు కొన్న సినిమా 30% నష్టాలు చవి చూసేలా చేసింది. ఇప్పుడు రాజశేఖర్ ఆవేశంగా ఎనౌన్స్ చేసిన సీక్వెల్ కంటే ముందు ఆ సినిమా ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలు తీరిస్తే బాగుంటుందేమో. ఇకపోతే.. రాజశేఖర్ తాజా చిత్రం “కల్కి” రేపు విడుదలవుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. మరి మనోడు ఆ అంచనాలను అందుకోగలుగుతాడో లేదో చూడాలి.