Rakesh Master: అంత్యక్రియల గురించి రాకేశ్ మాస్టర్ ఏం చెప్పారంటే?
June 19, 2023 / 10:45 PM IST
|Follow Us
టాలీవుడ్లో 1500కుపైగా సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్‌గా పని చేసిన రాకేశ్ మాస్టర్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన డ్యాన్స్ మాస్టర్‌గా ఎంత పేరు తెచ్చుకున్నారు అనేది పక్కనపెడితే… ఆయన హార్స్ కామెంట్స్‌తో వైరల్ అంతకంటే ఎక్కువ అయ్యారు అని చెప్పాలి. హీరోలా ఉండే ఆయన.. ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు అనేది ఇప్పుడు అప్రస్తుతం. అయితే ఆయన కామెంట్స్ చేసే క్రమంలో తన జీవితం గురించి, వేదాంత ధోరణిలో కొన్ని మాటలు చెప్పారు. ఇప్పుడు అవి వైరల్‌గా మారాయి.
రాకేశ్ మాస్టర్ గతంలో ఓ వ్యక్తి దగ్గర రూ. రెండు లక్షలు అప్పు చేశారట. అయితే కొన్ని కారణాల వల్ల రూ.30 వేలు తిరిగి ఇచ్చారట. అయితే అక్కడికి కొద్ది రోజులకు అప్పు ఇచ్చిన వ్యక్తి చనిపోయారట. దీంతో ఆయన కొడుకు వచ్చి డబ్బులు అడిగితే తన ఇంటి పత్రాలు ఇచ్చేశారట మాస్టర్. మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చేశానని చెప్పొచ్చని కానీ.. అలా చెబితే మోసం అవుతుందని చెప్పలేదని రాకేశ్ మాస్టర్ ఓ సందర్భంలో చెప్పారు.
రాకేశ్ మాస్టర్ ఇటీవల కాలంలో మనం చూసినట్లు ఎందుకు మారారు తెలియదు కానీ.. అంతా బాగుండే ఆయన ఇబ్బందికరంగా మారడానికి తన అనుకున్న వాళ్లంతా చనిపోవడం ఓ కారణమని చెప్పారు. జీవితంపై విరక్తి కలిగడంతోనే అలా చేశాను అని కూడా చెప్పారు. తన తమ్ముడు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డారట. ఆ తర్వాత అమ్మ చనిపోయిందట. అక్కడికి కొద్ది రోజులకు అక్క కొడుకు చనిపోయాడట. ఆ తర్వాతి రోజుల్లో తండ్రి చనిపోయారట. దీంతో తనకు చావంటే భయం లేదు గానీ… ఆ సంఘటనల వల్ల ఫోన్ కాల్ వస్తే భయపడిపోయేవాడినని రాకేశ్ మాస్టర్ తెలిపారు.
జీవింలో ఏదీ శాశ్వతం కాదు అని రాకేశ్ మాస్టర్ అనేవారు. ఇల్లు, దుస్తులు, శరీరం.. ఇలా ఏదీ శాశ్వతం కాదు అని అంటుండేవారు. ఈ మాటలు చెబుతూనే తన అంతిమ యాత్ర ఎలా ఉండాలి అనుకునేవారో అది కూడా చెప్పారు. ఆయన మామ గారు సమాధి పక్కన వేప మొక్క నాటారట మాస్టర్. తాను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే తనను సమాధి చేయాలని మాస్టర్ చెప్పేవారు.