టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన రాకేశ్ మాస్టర్ మృతి ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది. రాకేశ్ మాస్టర్ 1500 కంటే ఎక్కువ పాటలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించడం గమనార్హం. అలనాటి స్టార్ హీరోల నుంచి యంగ్ జనరేషన్ హీరోల వరకు ఎంతోమంది హీరోల సినిమాలకు రాకేశ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేయడంతో పాటు విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో రాకేశ్ మాస్టర్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను ఆకలితో స్నేహం చేశానని నాతోపాటు చాలామంది ప్రయాణం చేశారని కొందరు తిరిగి వెళ్లిపోయారని ఆయన చెప్పుకొచ్చారు. “నీ మాస్టర్ ను నమ్ముకుంటే నీ లైఫ్ మాడిపోయిన మసాలా దోసెలా అవుతుంది” అని శేఖర్ తో ఎవరో అన్నారని రాకేశ్ మాస్టర్ చెప్పుకొచ్చారు.
అలా కామెంట్లు చేసినా శేఖర్ నన్ను వదిలి వెళ్లలేదని ఆయన తెలిపారు. హీరో వేణు చిరునవ్వుతో సినిమాకు పని చేసే ఛాన్స్ ఇచ్చిన సమయంలో చాలా సంతోషించానని రాకేశ్ మాస్టర్ అన్నారు. ఒక వ్యక్తి దగ్గర రూ.2 లక్షలు అప్పు చేసి రూ.30 వేలు తిరిగి ఇచ్చానని ఆ వ్యక్తి చనిపోగా అతని కొడుకు వచ్చి డబ్బులు అడిగితే నా ఇంటి పత్రాలు ఇచ్చానని రాకేశ్ మాస్టర్ చెప్పుకొచ్చారు.
మీ నాన్నకు డబ్బులన్నీ తిరిగిచ్చేశానని చెప్పవచ్చని అయితే అలా చెబితే మాత్రం మోసం అవుతుందని రాకేశ్ మాస్టర్ పేర్కొన్నారు. నా తమ్ముడు చనిపోయిన సమయంలో చాలా బాధ పడ్డానని ఆ తర్వాత కుటుంబ సభ్యులలో చాలామంది మరణించారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సంఘటనల వల్ల ఫోన్ కాల్ వస్తే నాకు భయం వేసేదని రాకేశ్ మాస్టర్ కామెంట్లు చేశారు.
నా భార్య తండ్రి సమాధి పక్కనే వేప మొక్క నాటానని నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయాలని యూట్యూబ్ ఛానెళ్లకు విజ్ఞప్తి చేశానని రాకేశ్ మాస్టర్ చెప్పుకొచ్చారు. రాకేశ్ మాస్టర్ వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.